IND vs AFG : రాణించిన బౌలర్లు.. భారత లక్ష్యం ఎంతంటే?
ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ (IND vs AFG )ముగిసింది.
IND vs AFG 2nd T20 Team India Target is 160
IND vs AFG : ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 160 పరుగుల లక్ష్యం నిలిచింది.
Innings Break!
Clinical effort from #TeamIndia on the field 👏👏
Over to our batters to seal the series 🙌
Scorecard ▶️ https://t.co/96e4nhbYLf#AFGvIND pic.twitter.com/sKJbuY3x3F
— BCCI (@BCCI) September 15, 2026
అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (37; 33 బంతుల్లో 6 ఫోర్లు), రషీద్ ఖాన్ (28; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), దర్విష్ రసూలీ (26; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) , మహ్మద్ నబీ (20 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
