BiggBoss 6 Day 5 : అయిదు రోజులుగా సాగుతున్న బిగ్‌బాస్ హౌస్ లో తమ మొదటి కెప్టెన్ ని ఎన్నుకున్నారు. ముందు రోజే కెప్టెన్సీ టాస్క్ కి ఎవరెవరు అర్హులో చెప్పడంతో వారి మధ్య కెప్టెన్సీ బండి అనే ఓ టాస్క్ నడిచింది. ఈ టాస్క్ లో వాటర్‌లో కీస్ ఉంటాయి. నీళ్లలో తలముంచి నోటితో ఆ కీస్ తీసుకుని పక్కనే ఉన్న బాక్స్ ని ఓపెన్ చేయాలి. ఆ బాక్స్ లో ఒక కారు నెంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి తగ్గట్టు మరో టబ్‌లో ఉన్న నెంబర్స్ వెతికి తనకు కేటాయించిన కారు నెంబర్ని ఆర్డర్ లో సెట్ చేయాలి. ఈ టాస్క్ కి ఫైమా సంచాలక్‌గా వ్యవహరించింది.
అయితే ఈ టాస్క్ లో గీతూ రాయల్ ముందుగా టాస్క్ పూర్తి చేయగా ఆ తర్వాత బాలాదిత్య పూర్తి చేశాడు. అయితే గీతూ సరిగ్గా ఆడలేదు, తన గేమ్ చెల్లదు అని బాలాదిత్య విన్ అయ్యాడని ఫైమా తీర్పు ఇచ్చింది. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా బాలాదిత్యనే విన్నర్ అని చెప్పడంతో గీతూకి, ఫైమాకి మధ్య గొడవ జరిగింది. ఫైనల్ గా బాలాదిత్య హౌస్ లో మొదటివారం కెప్టెన్ అవ్వడంతో కంటెస్టెంట్ అంతా అతన్ని కెప్టెన్ సీట్ లో కూర్చోపెట్టారు.
ఇక మొదటి నుంచి గీతూ యాటిట్యూడ్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. యాటిట్యూడ్ చూపిస్తూ, వేరే వాళ్ళని టార్గెట్ చేస్తూ, పక్క వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ హడావిడి చేస్తూనే ఉంది. హౌస్ లో కంటెస్టెంట్స్ లో, బయట ప్రేక్షకుల్లో కూడా గీతూ మీద నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. కెప్టెన్సీ టాస్క్ తప్పుగా ఆడి సమర్ధించుకోవడం, ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేయడం, బాలాదిత్యతో కూడా గొడవ పెట్టుకోవడంతో ఈ సారి హౌస్ లో కంటెస్టెంట్స్ అంతా కలిసి గీతూని టార్గెట్ చేశారు.
BiggBoss 6: బిగ్‌బాస్ మొదటి కెప్టెన్సీ పోటీ మొదలు.. నేటి ఎపిసోడ్లో ఉత్కంఠ పోరు
ప్రతి వారం కెప్టెన్సీ తో పాటు వరస్ట్ పర్ఫార్మర్ ని కూడా ఎన్నుకుంటారన్న సంగతి తెలిసిందే. దీంతో గీతూ యాటిట్యూడ్ కి, గీతూ చేసే హడావిడికి హౌస్ లోని కంటెస్టెంట్స్ అంతా కలిసి గీతూని ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. ఏకంగా 15 మందికి పైగా గీతూకి వరస్ట్ పర్ఫార్మర్ గా ఓటు వేశారు. దీంతో ఈ వారం గీతూ వరస్ట్ పర్ఫార్మర్ గా ఎన్నికైంది. ఇది గీతూ ఊహించలేదు. మరి ఇప్పట్నుంచైనా గీతూ తన యాటిట్యూడ్ తగ్గించుకుంటుందా, లేక ఇలాగే మరింత హడావిడి చేస్తుందా చూడాలి. ఇక గీతూ వరస్ట్ పర్ఫార్మర్ అవ్వడంతో తనని జైల్లో పెట్టారు.
ఈ టాస్కుల మధ్యలో ఇనయా, శ్రీహాన్ కి మరోసారి గొడవ అయింది. ఈ గొడవలో ఇనయా శ్రీహాన్ లవర్ పేరు తీసుకురాగా శ్రీహాన్ సీరియస్ అయి బయటి వాళ్ళ పేర్లు తీయొద్దు అంటూ ఫైర్ అయ్యాడు. కాసేపు వీళ్లిద్దరి గొడవ నడిచింది. నేటి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి మరి ఎవరిగురించి ఎలా మాట్లాడతారో చూడాలి.