BiggBoss 6 Day 88 : కంటెస్టెంట్స్ ఎవరెవరు బిగ్‌బాస్ కప్పుని ఎందుకు గెలవాలనుకుంటున్నారో తెలుసా??
బిగ్‌బాస్ చివరికి వచ్చేయడంతో ఆట రసవత్తరంగా సాగుతుంది. టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చి ఒకర్ని ఆ టాస్కుల్లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ కి పంపిస్తాను అని చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా ఫైనల్ టికెట్ కోసం పోరాడుతున్నారు...................
- Saketh U
- Updated on- December 2, 2022 / 03:04 PM IST
BiggBoss 6 Day 88 biggboss contestants about biggboss cup
BiggBoss 6 Day 88 : బిగ్‌బాస్ చివరికి వచ్చేయడంతో ఆట రసవత్తరంగా సాగుతుంది. టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చి ఒకర్ని ఆ టాస్కుల్లో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ కి పంపిస్తాను అని చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా ఫైనల్ టికెట్ కోసం పోరాడుతున్నారు. మరి ఇప్పుడు మిగిలిన కంటెస్టెంట్స్ లో ఎవరు డైరెక్ట్ ఫైనల్ కి వెళ్తారో చూడాలి.
ఇక గురువారం ఎపిసోడ్ లో అసలు మీరు బిగ్‌బాస్ కప్పు ఎందుకు గెలవాలనుకుంటున్నారు అని బిగ్‌బాస్ అడగడంతో ఒక్కొక్కరు ఒక్కో ఆన్సర్ చెప్పారు.
BiggBoss 6 Day 85 : ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారో తెలుసా ?
మొదట శ్రీహాన్.. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ట్రోఫీ గెలవాలి, మా అమ్మ నన్ను అడిగిన మొదటి కోరిక అది అని చెప్పాడు.
ఇక రోహిత్.. మా నాన్న పేరు నిలబెట్టేందుకు కప్పు గెలవాలి అన్నాడు.
ఇక రేవంత్.. బిగ్‌బాస్ షోలో మొదటి నుంచి ప్రతి టాస్క్ లో బాగా ఆడుతున్నా. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకి వెళ్తున్నా. అందుకే ట్రోఫీ నాకు చాలా ముఖ్యం అని చెప్పాడు.
ఇక శ్రీసత్య.. నా లైఫ్ లో ఏది అంత ఈజీగా దొరకలేదు. పోరాడి సాధించుకున్నా. అలాంటిది బిగ్‌బాస్ కప్పు గెలిస్తే ఆ కిక్కే వేరు. మా అమ్మ నాన్నలు కూడా కప్పు గెలిచి రమ్మన్నారు, వాళ్ళ కోసం అయినా కప్పు గెలవాలి అని చెప్పింది.
ఇక కీర్తి.. నా లాంటి ఒంటరి అమ్మాయిలకి ఆదర్శంగా నిలవడానికి కప్పు కొట్టాలి అని చెప్పింది.
ఫైమా.. మా కుటుంబం కోసం, అమ్మాయిలకి ఆదర్శంగా నిలబడేందుకు ట్రోఫీ గెలవాలని ఉంది అని చెప్పింది.
ఆదిరెడ్డి.. మొదటిసారి ఓ కామన్ మ్యాన్ ఇన్ని రోజులు హౌజ్ లో ఉన్నాడు. అడ్డదారులు తొక్కకుండా జెన్యూన్ గా ఆడి కప్పు కొడితే అదే హ్యాపీ అని చెప్పాడు.
ఇక చివరగా ఇనయా.. నువ్వు అమ్మాయివి, ఏం చేయలేవు, చదువుకోలేదు.. ఇలా చాలా మంది చాలా అన్నారు. వాళ్లందరికీ సమాధానం చెప్పడానికి అయినా కప్పు గెలవాలి, కప్పు గెలిచి మా నాన్నకి అంకితమివ్వాలి అని చెప్పింది. మరి వీరిలో ఎవరు కప్పు గెలుస్తారో చూడాలి.
