Wedding Diaries : ‘వెడ్డింగ్ డైరీస్’ ట్రైలర్ రిలీజ్.. బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా..

తాజాగా వెడ్డింగ్ డైరీస్ సినిమా ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రిలీజ్ చేసారు.

BiggBoss Fame Arjun Ambati Wedding Diaries Trailer Released by Lyric Writer Chandrabose

Wedding Diaries Trailer : బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ జంటగా తెరకెక్కిన సినిమా ‘వెడ్డింగ్ డైరీస్’. MVR స్టూడియోస్ బ్యానర్ పై డా. మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె నిర్మిస్తూ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. వెడ్డింగ్ డైరీస్ సినిమా ఆగస్టు 23న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ రిలీజ్ చేసారు.

లిరిక్ రైటర్ చంద్రబోస్ ట్రైలర్ లాంచ్ అనంతరం మాట్లాడుతూ.. వెడ్డింగ్ డైరీస్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత అపార్ధాలు, అపోహలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఏది శాశ్వతం కాదు. వైవాహిక బంధం మాత్రమే శాశ్వతం అనే మంచి కథతో ఈ వెడ్డింగ్ డైరీస్ సినిమా రాబోతుంది. చిత్ర యూనిట్ కి నా శుభాకాంక్షలు. ఆగస్టు 23న రిలీజయ్యే ఈ సినిమాని థియేటర్లో చూసి విజయం అందించాలి అని అన్నారు. మీరు కూడా వెడ్డింగ్ డైరీస్ ట్రైలర్ చూసేయండి..

 

ఈ సందర్భంగా హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చంద్ర బోస్ గారు మా సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇది మంచి కుటుంబ కథ చిత్రం. అందరూ చూడొచ్చు అని అన్నారు. సినిమా దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ.. వివాహిత జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో చూపిస్తుంది ఈ సినిమా. రోజూ జరిగే గొడవలు, విభేదాలతో చాలామంది విడిపోవాలని అనుకుంటారు. కానీ తర్వాత ప్రేమను, తమ బంధాన్ని ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకుని, పెళ్లిని పునర్నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. ఆగస్టు 23న మహా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వెడ్డింగ్ డైరీస్ రిలీజ్ కానుంది అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు