BiggBoss4 : టాప్ రేటింగ్‌తో సత్తా ఛాటిన సమంత..!
- vamsi
- Updated on- November 5, 2020 / 03:31 PM IST
తెలుగు, తమిళం అంటూ భాషలతో తేడా లేకుండా తనదైన శైలిలో వెండితెరపై మెప్పించిన ముద్దుగుమ్మ సమంత.. టెలివిజన్ తెరపై బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌లో ఒకే ఒకసారి కనిపించి, బుల్లితెర మహారాణి తానే అని నిరూపించుకుంది. రైటర్ రాసిన స్క్రిప్టుకు.. దర్శకుడు చెప్పినట్లుగా చెయ్యడమే హోస్టింగ్.. అయితే ఆ హోస్ట్‌ని బట్టే ప్రోగ్రామ్‌లు నడుస్తాయి కదా? అదే పని చేసింది సమంత. అయితే ఈ ఒక్కరోజు షో నే బిగ్‌బాస్ నాల్గవ సీజన్లో భారీ టీఆర్వీ దక్కించుకున్న ప్రోగ్రామ్‌గా నిలిచింది.
వాస్తవానికి తెలుగులో బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్, నానీ, తర్వాత నాగార్జునలే. పోయిన సీజన్లో నాగార్జున లేక రెండు ఎపిసోడ్స్‌కి ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ.. అప్పుడు అదరగొట్టేసింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే రాగా.. ఈసారి మాత్రం తన స్థానంలోకి కోడలు సమంత వచ్చేసింది. దసరా రోజు మరి అక్కినేని కోడలు బిగ్ బాస్ హోస్ట్‌గా మారి అదరగొట్టేసింది.
దసరా ఆదివారం ఎపిసోడ్‌ని మూడున్నర గంటల పాటు లాంగ్ ఎపిసోడ్‌ని ప్రసారం చేసింది. హోస్ట్‌గా సమంతని పరిచయం చేసి నాగార్జున త్పపుకోగా చీరకట్టులో చాలా అందంగా సమంత ఎంతో అనుభవం ఉన్న యాంకర్ మాదిరిగా బిగ్ బాస్ స్టేజ్‌పై అదరగొట్టేసింది. పట్టు చీర కట్టుకుని.. మేడలో బంగారు ఆభరణాలతో అచ్చ తెలుగు అమ్మాయిలా అక్కినేని కోడలు సమంత మెరిసిపోయింది. మరిది అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మధ్యలో ఎంట్రీ ఇవ్వగా.. జబర్దస్త్ ఆదితో ఆటలు, పాటలు, డాన్స్ లు, మధ్యలో బిగ్ బాస్ స్టేజ్ మీద కార్తికేయ డాన్స్, పాయల్ అందాలు గట్టి హంగామానే సాగింది.
https://10tv.in/biggboss-offered-remuneration-to-samanta-morethan-nagarjuna/
బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు తీసుకుని పక్కాగా చేసిన సమంత.. దసరా మహా ఎపిసోడ్‌ని 11.4 టీఆర్పీ రేటింగ్‌తో టాప్ షోగా నిలిపింది. సమంత ఎపిసోడ్‌కి తక్కువ రేటింగ్ వచ్చిందని తప్పుడు ప్రచారాలు రాగా.. తాజాగా వచ్చిన రేటింగ్ ప్రకారంగా చూస్తే ఆ ఎపిసోడ్లో సమంత సత్తా చాటిందని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్‌కి తక్కవ రేటింగ్ వచ్చినట్లుగా వచ్చినవి అన్నీ పుకార్లే అని తేలిపోయింది.
