Bollywood Actor Reacts on his Comments about Prabhas Video goes Viral
Prabhas – Arshad Warsi : ఇటీవల కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడని ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసాడు. దీంతో ఆ కామెంట్స్ వైరల్ అవ్వగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా అర్షద్ వార్సీ పై ఫైర్ అయ్యారు. మన టాలీవుడ్ లో చాలా మంది హీరోలు డైరెక్ట్ గానే అర్షద్ వార్సీ పై విమర్శలు చేసారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..? అర్షద్ వార్సీని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు.
దానిపై ఇప్పటి వరకు మళ్ళీ రియాక్ట్ కానీ అర్షద్ వార్సీ తాజాగా ఆ కామెంట్స్ పై స్పందించారు. తాజాగా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ అబుదాబిలో జరిగిన ఐఫా ఉత్సవంలో పాల్గొనగా అక్కడి మీడియా నుంచి ప్రభాస్ ని కామెంట్ చేసిన దాని గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అర్షద్ వార్సీ తన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు.
అర్షద్ వార్సీ మాట్లాడుతూ.. అందరికి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్లకు ఉంటుంది. నేను కేవలం క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడాను. వ్యక్తి గురించి మాట్లాడలేదు. అతను బ్రిలియంట్ యాక్టర్. అతను ఇది చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కానీ బ్యాడ్ క్యారెక్టర్స్ ని మంచి నటులకు ఇస్తే ఆడియన్స్ ఒప్పుకోరు అని అన్నాడు. మరి దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
#Prabhas is a brilliant actor and he has proved himself again and again.
— Suresh PRO (@SureshPRO_) September 29, 2024