×
Ad

Celina Jaitly : భర్తపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టిన మంచు విష్ణు హీరోయిన్.. ఏకంగా 50 కోట్లు ఇమ్మంటూ.. పైగా ప్రతినెలా..

గత కొన్నాళ్లుగా సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ తో విబేధాలు ఉండగా అతనికి దూరంగానే తన పిల్లలతో కలిసి జీవిస్తుంది. (Celina Jaitly)

Celina Jaitly

Celina Jaitly : తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ తన భర్తపై డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టడం సంచలనంగా మారింది. బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ తన కెరీర్ ఆరంభంలో తెలుగులో మంచు విష్ణు సరసన సూర్యం సినిమాలో హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ లో జవానీ దివాని, నో ఎంట్రీ, జిందా, అప్నా సప్నా మనీ మనీ, గోల్ మాల్ రిటర్న్స్.. లాంటి పలు హిట్ సినిమాల్లో నటించింది.(Celina Jaitly)

2012 లో సెలీనా జైట్లీ ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త పీటర్ హాగ్ ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2012 లో కవలలు పుట్టారు. మళ్ళీ 2017 లో కూడా కవలలు పుట్టారు. అయితే రెండోసారి పుట్టిన అబ్బాయిల్లో ఒకరు ఆరోగ్య సమస్యలతో మరణించారు. గత కొన్నాళ్లుగా సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ తో విబేధాలు ఉండగా అతనికి దూరంగానే తన పిల్లలతో కలిసి జీవిస్తుంది.

Also Read : Malavika Mohanan : ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపై హీరోయిన్ కామెంట్స్.. ఏదో రెండు మూడు సీన్స్ ఇస్తారనుకున్నా..

తాజాగా సెలీనా జైట్లీ తన భర్త పీటర్ మీద ముంబై కోర్ట్ లో పలు ఆరోపణలు చేస్తూ డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది. ఈ కేసులో తనని శారీరికంగా, మానసికంగా, లైంగికంగా బాధపెడుతున్నట్టు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో తనకు జరిగిన నష్టంకు కాను 50 కోట్లు ఇవ్వాలని, అలాగే ప్రతి నెల తన పిల్లల మెయింటైనెన్స్ కోసం పది లక్షలు ఇవ్వాలని కోరింది. దీంతో సెలీనా జైట్లీ -పీటర్ అంశం చర్చగా మారింది.

సెలీనా జైట్లీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆపేసింది. 2012 లో చివరి సినిమాలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంది. తన ముగ్గురు పిల్లలతో కలిసి వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తుంది సెలీనా జైట్లీ.

Also Read : Samantha : కోపం ఎందుకు సమంత..? ఫిట్నెస్ పోస్ట్ పై నెటిజన్ కామెంట్.. సమంత రిప్లై వైరల్..