Malavika Mohanan : ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపై హీరోయిన్ కామెంట్స్.. ఏదో రెండు మూడు సీన్స్ ఇస్తారనుకున్నా..
తాజాగా మాళవిక మోహనన్ రాజాసాబ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. (Malavika Mohanan)
Malavika Mohanan
Malavika Mohanan : ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. సంక్రాంతికి ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు.(Malavika Mohanan)
తాజాగా మాళవిక మోహనన్ ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ అనే ఈవెంట్లో పాల్గొనగా రాజాసాబ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
మాళవిక మోహనన్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ సినిమా అంటే ఓ రెండు మూడు సీన్లు ఉంటాయేమో అనుకున్నా. ఎందుకంటే స్టార్ హీరో సినిమాల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండదు. ఒక పాట ఓ అయిదారు సీన్స్ లో కనిపిస్తేనే లక్కీ. కానీ రాజా సాబ్ సినిమాలో నాది చాలా మంచి రోల్. చాలా పెద్ద పాత్రే. ఒక అమ్మాయికి అలాంటి పాత్ర రావడం గొప్ప. ఇది నా తెలుగు డెబ్యూ కావడంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.
ఇప్పటికే రిలీజయిన ట్రైలర్, టీజర్స్ లో మాళవిక మోహనన్ ప్రభాస్ తో రొమాంటిక్ సీన్స్ తో పాటు యాక్షన్, హారర్ సీన్స్ కూడా చేసినట్టు తెలుస్తుంది. మాళవిక.. పెట్టా, మాస్టర్, మారన్, తంగలాన్.. లాంటి పలు తమిళ సినిమాలతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతుంది. దీంతో మాళవిక రాజాసాబ్ తో ఇస్తున్న తెలుగు ఎంట్రీ కోసం ఆమె ఫాలోవర్స్ ఎదురుచూస్తున్నారు.
Also Read : Raviteja : రవితేజ తో సమంత చేయట్లేదా? సమంత ప్లేస్ లో ఆ హీరోయిన్.. ఇదైనా హిట్ అవుద్దా?
