Rajamouli : వామ్మో.. వారణాసి ఈవెంట్ వెనక ఇంత కష్టపడ్డారా? దగ్గరుండి చూసుకున్న రాజమౌళి.. మేకింగ్ వీడియో వైరల్..

వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ ని ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. (Rajamouli)

Rajamouli : వామ్మో.. వారణాసి ఈవెంట్ వెనక ఇంత కష్టపడ్డారా? దగ్గరుండి చూసుకున్న రాజమౌళి.. మేకింగ్ వీడియో వైరల్..

Image Credits : Varanasi Movie Youtube Channel

Updated On : November 25, 2025 / 5:37 PM IST

Rajamouli : రాజమౌళి – మహేష్ సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ ని ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మహేష్ బాబు ఎద్దు మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. స్టేజిని కూడా భారీగా కట్టారు. ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.(Rajamouli)

అయితే ఈ ఈవెంట్ కి బాగా కష్టపడ్డారు. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడానికి, మహేష్, మిగిలిన వారి ఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేయడానికి కొన్ని రోజుల ముందు నుంచే రాజమౌళి ప్లాన్ చేసి దగ్గరుండి మరీ అన్ని పనులు చేసుకున్నారు. ఈ ఈవెంట్ కి పూజ మొదలుపెట్టినప్పటినుంచి బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా రాజమౌళి దగ్గరుండి చూసుకున్నాడు.

Also Read : Raviteja : రవితేజ తో సమంత చేయట్లేదా? సమంత ప్లేస్ లో ఆ హీరోయిన్.. ఇదైనా హిట్ అవుద్దా?

తాజాగా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఇందులో రాజమౌళి అన్ని పనులు దగ్గరుండి చేయిస్తున్నాడు. మహేష్ ఎంట్రీని కూడా ముందే చెక్ చేసారు. రాజమౌళి కూడా అది కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో అని చెక్ చేసారు. దీంతో ఈ మేకింగ్ వీడియో వైరల్ అవ్వగా సినిమాకే కాదు ఈవెంట్ కి కూడా రాజమౌళి ఇంతలా కష్టపడతారా అని ఆయన్ని అభినందిస్తున్నారు.

వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ మేకింగ్ వీడియో మీరు కూడా చూసేయండి..

Also Read : Samantha : కోపం ఎందుకు సమంత..? ఫిట్నెస్ పోస్ట్ పై నెటిజన్ కామెంట్.. సమంత రిప్లై వైరల్..