Esha Gupta : ఈషా గుప్తా కూడా సమంతలా బాధపడుతుందా..? ఆమె తీసుకున్న హైపర్బేరిక్ థెరపీనే ఈమె కూడా..!
రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈషా గుప్తా కూడా సమంతలా హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ తీసుకుంటుంది. దీంతో ఆమె కూడా..
- gum 95921
- Published On : July 28, 2023 / 06:46 PM IST
Bollywood actress Esha Gupta taking Hyperbaric Oxygen Therapy like samantha
Esha Gupta : ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ తనకి వచ్చిన అరుదైన వ్యాధిని బయట పెట్టడానికి సందేహించి, తమలోని బాధ పడుతుంటారు. కానీ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన అరుదైన వ్యాధిని బయటపెట్టి, దాని పై పోరాటం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో పలువురు స్టార్స్ కూడా తన అనారోగ్య సమస్యలను బయటపెడుతూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఫోటో చూస్తుంటే తాను కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.
Bro Movie : మూవీలో ‘శ్యాంబాబు’ ఆ ఏపీ మంత్రినా బ్రో.. సోషల్ మీడియాలో వైరల్..!
ఆ ఫొటోలో ఈషా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కనిపిస్తుంది. ఆ పోస్ట్ కి హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ (Hyperbaric Oxygen Therapy) అనే క్యాప్షన్ కూడా పెట్టింది. గతంలో ఇదే థెరపీని సమంత కూడా తీసుకుంది. మాయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సమంత.. ఆ వ్యాధి చికిత్సలో భాగంగా ఈ థెరపీని కూడా తీసుకుంది. ఆ సమయంలో సామ్ దాని వల్ల కలిగే ఉపయోగాలు కూడా చెప్పుకొచ్చింది. పాడైన కండరాలను బాగుచేయడం, కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి హైపర్బేరిక్ థెరఫీ కాపాడుతుందని వెల్లడించింది.
Mahesh – Allu Arjun : టాలీవుడ్ లో వారసుల కంటే వారసురాళ్లకే ఎక్కువ ఫాలోయింగ్.. సితార, అర్హ..!
ఇక ఇప్పుడు ఈషా కూడా అదే థెరపీని తీసుకుంటుండడంతో ఆమె కూడా మాయోసైటిస్ భారిన పడిందా? లేదా మరో అనారోగ్య సమస్యా? అంటూ నెటిజెన్స్ ఆరా తీస్తున్నారు. కాగా ఈషా.. తెలుగులో రెండు సినిమాల్లో కనిపించింది. సచిన్ జోషితో కలిసి ‘వీడెవడు’ అనే బై లింగువల్ (తెలుగు, తమిళ్) మూవీలో నటించింది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన కలిసి చిందేసింది. 2019లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో ‘ఏక్ బార్ ఏక్ బార్’ అంటూ చరణ్ తో కలిసి స్టెప్పులు వేసి అదరగొట్టింది.
Bollywood actress Esha Gupta taking Hyperbaric Oxygen Therapy like samantha
