Mahesh – Allu Arjun : టాలీవుడ్‌ లో వారసుల కంటే వారసురాళ్లకే ఎక్కువ ఫాలోయింగ్.. సితార, అర్హ..!

టాలీవుడ్ లో సితార అండ్ అర్హ సందడి మాములుగా లేదు. తమ అన్నయ్యలని పక్కకి నెట్టేసి.. ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.

Mahesh – Allu Arjun : టాలీవుడ్‌ లో వారసుల కంటే వారసురాళ్లకే ఎక్కువ ఫాలోయింగ్.. సితార, అర్హ..!

Mahesh Babu and Allu Arjun daughters Sitara Arha

Updated On : July 28, 2023 / 6:41 PM IST

Mahesh Babu – Allu Arjun Daughters : టాలీవుడ్ కి వారసులుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్, ఎన్టీఆర్, చరణ్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పుడు ఈ హీరోలు వారసులు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే టాలీవుడ్ లో వారసుల సందడి కంటే ఎక్కువ వారసురాళ్ల హుషారు ఎక్కువ కనిపిస్తుంది. ఈ స్టార్ హీరోలా కొడుకులు కెమెరా ముందు అరుదుగా కనిపిస్తూ ఉంటున్నారు. కానీ కూతుళ్లు మాత్రం అభిమానుల ముందు సందడి చేస్తూ అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు.

Samantha : బాలిలో సమంత బుల్లి నిక్కరు డాన్స్ అదుర్స్.. 100 శాతం ఎంజాయ్ చేశానంటున్న వీడియో వైరల్..

ఆ వారసురాళ్లు ఎవరో కాదు. మహేష్ బాబు ముద్దులు కూతురు సితార (sitara ghattamaneni), అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ (Allu Arha). ప్రస్తుతం వీరిద్దరికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. సితార డాన్స్ వీడియోలతో ట్రెండ్ అవుతుంటే.. అర్హ తన అల్లరి పనులతో వైరల్ అవుతుంటుంది. సోషల్ మీడియాతోనే ఆగలేదు. తమ అన్నయ్యలు కంటే ముందే ప్రొఫెషనల్ కెరీర్ ని స్టార్ట్ చేసి.. కెరీర్ లో మేమే సీనియర్స్ అనిపించుకుంటున్నారు. సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన అర్హ.. ముద్దు మాటలతో అందర్నీ ఆకట్టుకుంది.

Chiranjeevi Remuneration : భోళా శంకర్ సినిమాకి రెమ్యునరేషన్ వ‌ద్ద‌న్న చిరంజీవి.. ఎందుకో తెలుసా?

ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) సినిమాలో కూడా హీరోయిన్ చిన్నప్పటి పాత్ర కోసం అర్హని సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ 10 నిముషాలు పాత్ర చేయడం కోసం అర్హకి.. ఒక్కో నిమిషానికి 2 లక్షలు చొప్పున 20 లక్షల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. అలాగే సితార విషయానికి వస్తే.. తన తండ్రి లాగానే ఒక సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసేసింది. సినిమాల్లోకి రాకుండానే అతి చిన్న వయసులోనే ఒక సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా మారడమే కాకుండా.. దాని కోసం చేసిన యాడ్ కి హీరోయిన్ రేంజ్ లో 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. మరి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఇద్దరు ఫ్యూచర్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.