×
Ad

Kajol: పెళ్ళికి ఎక్స్పైరీ డేట్.. కాజల్ షాకింగ్ కామెంట్స్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్

కొన్నిసార్లు మన స్టార్స్ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతాయి. వారు కేవలం వారి(Kajol) అభిప్రాయాలను వెల్లడిస్తున్నాం అనుకుంటారు కానీ, ఆ అభిప్రాయాలలో కొంతమంది నమ్మకాలు, మనోభావాలు ఉంటాయని మర్చిపోతారు.

Bollywood actress Kajol shocking comments on marriage

Kajol: కొన్నిసార్లు మన స్టార్స్ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతాయి. వారు కేవలం వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నాం అనుకుంటారు కానీ, ఆ అభిప్రాయాలలో కొంతమంది నమ్మకాలు, మనోభావాలు ఉంటాయని మర్చిపోతారు. దాంతో సోషల్ మీడియాలో టార్గెట్ (Kajol)అవుతూ ఉంటారు. ఇలాంటి కామెంట్స్ చేసి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీస్ ట్రోలింగ్ భారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ కాజోల్ వివాదాస్పద కామెంట్స్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఆ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో సోషల్ మీడియాలో ఆమెపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది.

Sundar C: అట్టహాసంగా మొదలయ్యింది.. అర్ధాంతరంగా ఆగిపోయింది.. దర్శకుడు తప్పుకున్నాడట..

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, ట్వింటిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే టాక్ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. తాజాగా ఈ షోకి విక్కీ కౌశల్, కృతి సనన్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్బంగా హిస్ట్ ట్వింటిల్ ఖన్నా వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. పెళ్ళికి కూడా గడువు తేదీ ఉండాలా? రెన్యువల్ ఆప్షన్ ఉండాలా? అని గెస్టులను ప్రశ్నించింది. దానికి గెస్టులు ఒకే రకంగా స్పందించాడు. “పెళ్లి అనేది వాషింగ్ మిషన్ కాదు.అలాంటి వాటికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుందేమో కానీ పెళ్ళికి కాదు”అంటూ సమాధానం చెప్పారు.

దానికి మరో హోస్ట్ కాజోల్ స్పందిస్తూ.. “పెళ్ళికి వివాహ ఎక్స్ పైరీ డేట్ ఉంటే మంచిది. ఇష్టం లేని వ్యక్తిని జీవితమంతా భరించడం కరెక్ట్ కాదు. కాబట్టి.. పెళ్ళికి ఎక్స్ పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉంటేనే మంచిది” అంటూ సమాధానం ఇచ్చింది. కాజోల్ చెప్పిన ఈ సమాదానికి గెస్టులు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే, పెళ్లిపై కాజోల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. పెళ్లి అనేది పవిత్రమైన బంధం అని. దానికి ఎక్స్ పైరీ డేట్, రెన్యూవల్ డేట్స్ ఉండాలి అనడం ఏంటి? అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి తన కామెంట్స్ ను కాజోల్ ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.