Sundar C: అట్టహాసంగా మొదలయ్యింది.. అర్ధాంతరంగా ఆగిపోయింది.. దర్శకుడు తప్పుకున్నాడట..
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయిన విషయం (Sundar C)తెలిసిందే. దర్శకుడు సుందర్ సి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Director Sundar C walks out from Rajinikanth-Kamal Haasan movie
Sundar C: లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయిన(Sundar C) విషయం తెలిసిందే. దర్శకుడు సుందర్ సి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనికి సంబందించిన అధికారిక వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఇద్దరు లెజెండ్స్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జైలర్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు షూటింగ్ మొదలవుతుంది అనుకున్నారు అంతా. కానీ, అలా జరగలేదు. అనూహ్యంగా ఈ భారీ ప్రాజెక్టు నుంచి దర్శకుడు సుందర్ సి తప్పుకున్నాడు.
Rashmika Mandanna: ఇందుకే నేను రాను.. లేనిపోనివి అంటగడుతున్నారు.. అసలు నేను ఆలా అనలేదు..
ఈమేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. “కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల రజనీకాంత్ 173 వ సినిమా నుంచి నేను తప్పుకొంటున్నాను. అయినప్పటికీ, రజనీకాంత్, కమల్ హాసన్‌లతో నా అనుబంధం అలానే కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా వాళ్లతో గడిపిన క్షణాలను నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను”అంటూ రాసుకొచ్చాడు సుందర్ సి. కానీ, ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తాను ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనే కారణాన్ని మాత్రం నోట్ లో వివరించలేదు సుందర్ సి. దీంతో ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.
ఇక సుందర్ సి విషయానికి వస్తే, ఆయన రజనీకాంత్ తో గతంలో అరుణాచలం అనే సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో, ఇప్పుడు కూడా అదే రేంజ్ సబ్జెక్టు తో వచ్చి ఈ ఇద్దరు సూపర్ హిట్ కొడతారు అనుకున్నారు అంతా. కానీ, సినిమా మొదలై వారం గడవక ముందే క్యాన్సిల్ అయిపొయింది. దీంతో, రజనీకాంత్ నుంచి అరుణాచలం లాంటి బ్లాక్ బస్టర్ ను ఆశించిన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే, ప్రాజెక్టు నుంచి కేవలం దర్శకుడు మాత్రమే బయటకు వచ్చాడా లేక మొత్తం ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.
