Yash – Srinidhi : కేజీఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా వైడ్ పాపులారిటీని, ఆ రేంజ్ సక్సెస్ ని అందుకున్న సినిమా కేజీఎఫ్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మాస్ యాక్షన్ మూవీస్ కి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశాడు. కన్నడ యాక్టర్స్ యశ్ అండ్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా వైడ్ ఫేమ్ ని సంపాదించుకున్నారు.
కాగా ఇటీవల ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు, శ్రీనిధి ఫోటో పెట్టి ఆమె చెప్పినట్లు ఒక సంచలన ట్వీట్ చేశాడు. ”కేజీఎఫ్ సెట్ లో యశ్ తో పని చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది. తను నన్ను వేధించాడు. తనతో కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేయను” అంటూ చెప్పుకొచ్చినట్లు ఉమైర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్త కన్నడనాట వైరల్ అయ్యింది. దీంతో శ్రీనిధి రియాక్ట్ అవుతూ ట్వీట్ చేసింది.
”సోషల్ మీడియా వేదికను కొంతమంది దుర్వినియోగం చేయడానికి, చెడుని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నేను ఆ వేదికను ప్రేమ మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగిస్తుంటాను. ఈ నేపథ్యంలోనే నేను మీకు చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే.. కేజీఎఫ్ వంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించేటప్పుడు నాకు రాకింగ్ స్టార్ యశ్ తో కలిసి పని చేసే గౌరవం దక్కింది. అతను మంచి మనిషి, స్నేహితుడు, గురువు మరియు ఒక ఇన్స్పిరేషన్. నేను ఎప్పటికి యశ్ అభిమానినే” అంటూ ఒక నోట్ రిలీజ్ చేసింది. దీంతో బాలీవుడ్ క్రిటిక్ కామెంట్స్ లో నిజం లేదని తేల్చి చెప్పేసేంది.
As per #KGFChapter2 Actress #SrinidhiShetty, I felt very uncomfortable working with #Yash. Will never work with him again. He is very Toxic, Tharki & Harassed Kind of Person. pic.twitter.com/0T6rZDA87p
— Umair Sandhu (@UmairSandu) March 12, 2023
🌸🙏🏻🤗@TheNameIsYash ⭐️ pic.twitter.com/iAo6xCJjU1
— Srinidhi Shetty (@SrinidhiShetty7) March 16, 2023