Vivek Ranjan Agnihotri : మాపై దాడి చేసి కొట్టారు.. ఇప్పుడు బెంగాల్ లో భయం లేకుండా నడవొచ్చు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మమతాబెనర్జీ హయాంలో తమపై జరిగిన దాడుల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు. (Vivek Ranjan Agnihotri)
- Saketh U
- Published on- May 6, 2026 / 09:57 AM IST
Vivek Ranjan Agnihotri
Vivek Ranjan Agnihotri : పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో సెలబ్రిటీలు సైతం ఈ ఫలితాలపై స్పందిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం మమతాబెనర్జీని, ఆమె పార్టీని, బెంగాల్ లో జరిగిన సంఘటనలను ప్రత్యక్షంగానే విమర్శిస్తూ పోస్టులు చేసారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మమతాబెనర్జీ హయాంలో తమపై జరిగిన దాడుల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
Also Read : Rajinikanth : ఛ.. రజినీకాంత్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా? అదే జరిగుంటే సీఎం అయ్యేవారా?
వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ఇకపై ఇలాంటివి జరగకూడదు. తెలియని వారి కోసం చెబుతున్నా. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా రిలీజ్ అయ్యాక నన్ను పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ బహిష్కరించారు. ఆ సినిమాని థియేటర్స్ నుంచి తొలగించారు. ఇక ది బెంగాల్ ఫైల్స్ సినిమాను అయితే పశ్చిమ బెంగాల్‌లో పూర్తిగా బ్యాన్ చేసారు. ఆ సినిమా ట్రైలర్ కార్యక్రమాన్ని అడ్డుకొని మాపై దాడి చేసి కొట్టారు. నాపై అనేక కేసులు పెట్టారు. అయినా నేను వెనుకడుగు వేయలేదు. ఈ ఎన్నికల సమయంలో ది బెంగాల్ ఫైల్స్ సినిమాని బెంగాల్ వ్యాప్తంగా చాలామందికి రహస్యంగా చూపించాం. మా శక్తి మేరకు మేము పోరాడాము. బెంగాల్ మహనీయులకు అభినందనలు. ఇకపై బెంగాల్ ప్రజలు ఎలాంటి భయం లేకుండా తలెత్తి గర్వంగా నడవొచ్చు అని అన్నారు.
NEVER AGAIN.
For those who don’t know, @MamataOfficial cancelled me in Bengal after the release of #TheKashmirFiles. The film was taken out of cinema halls, and she said I would NOT BE ALLOWED TO ENTER Bengal.
Last year, she BANNED #TheBengalFiles completely in West Bengal. Our… pic.twitter.com/9JzHU2lgwE
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) May 5, 2026
Also Read : Sathyaraj : విజయ్ గెలిచినా నా సపోర్ట్ డీఎంకే పార్టీకే.. కట్టప్ప కామెంట్స్ వైరల్..
