Akshay Kumar : నా సినిమాలు ఫెయిల్ అయితే చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటారు.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా దాదాపు 10 సినిమాలకు పైగా ఫ్లాప్స్ చూస్తూనే ఉన్నారు.
- Saketh U
- Published On : July 13, 2024 / 07:44 AM IST
Bollywood Hero Akshay Kumar Sensational Comments on Industry People and his Failure Movies
Akshay Kumar : ఏ హీరోకి అయినా సినిమాల్లో హిట్స్, ఫ్లాప్స్ మాములే. ఫ్లాప్ అయినా, హిట్ అయినా మళ్ళీ ఇంకో సినిమాతో వస్తూనే ఉంటారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా దాదాపు 10 సినిమాలకు పైగా ఫ్లాప్స్ చూస్తూనే ఉన్నారు. 2021 నుంచి ఇప్పటివరకు అక్షయ్ నుంచి ఆల్మోస్ట్ 12 సినిమాలు రిలీజయితే అందులో ఒకటి హిట్ అవ్వగా ఒకటి యావరేజ్ గా నిలిచింది. మిగిలినవన్నీ ఫ్లాప్స్ గానే మిగిలాయి.
దీంతో అక్షయ్ కుమార్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. డబ్బుల కోసం వేగంగా సినిమాలు చేసి రిలీజ్ చేస్తున్నాడని, కథల గురించి ఆలోచించట్లేదని, అక్షయ్ వల్ల నిర్మాతలకు లాస్ అని విమర్శలు చేస్తున్నారు. తాజాగా నిన్న అక్షయ్ నటించిన సర్ఫిరా సినిమా రిలీజయింది. సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాని కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. టికెట్స్ కూడా సేల్ అవ్వట్లేదు. దీంతో మరోసారి అక్షయ్ పై విమర్శలు వస్తున్నాయి.
తాజాగా అక్షయ్ కుమార్ సర్ఫిరా ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కొంతమంది నా సినిమాలు ఫెయిల్ అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటారని నాకు తెలుసు. సినిమాల విషయంలో నాకు చాలామంది చాలా సలహాలు ఇస్తున్నారు. కానీ నేను రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాను. స్లోగా సినిమాలు చేస్తే హిట్ అవుతుందని గ్యారెంటీ ఉందా అని అన్నారు. దీంతో అక్షయ్ వ్యాఖ్యలు వైరల్ గా అమారాయి. మరి అక్షయ్ సినిమాలు ఫెయిల్ అయితే సెలబ్రేట్ చేసుకునేది ఎవరో?
