Hrithik Roshan : హాలీవుడ్ చిత్ర‌ ప్రచారంలో హృతిక్ రోష‌న్‌..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ (Hrithik Roshan) హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ప్రమోషన్స్‌లో భాగంగా అయ్యారు.

Bollywood hero Hrithik Roshan Promotions Project Hail Mary

Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ హాలీవుడ్ సైన్స్-ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ప్రమోషన్స్‌లో భాగంగా అయ్యారు. ప్ర‌తీ భార‌తీయ సినీ ప్రేక్ష‌కుడికి ఈ చిత్రాన్ని చేరువ చేయాల‌నే ఉద్దేశ్యంతో ఆయ‌న హాలీవుడ్ దర్శక నిర్మాతలతో చేతులు కలిపారు. ఇక ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హృతిక్ జాదూ వర్సెస్ రాకీ అంటూ ఓ ప్ర‌త్యేక వీడియోతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు.

హృతిక్ తన సూపర్ హిట్ సాంగ్ ‘ఏక్ పల్ కా జీనా’ ఐకానిక్ స్టెప్‌ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ ‘రాకీ’కి నేర్పిస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. దీంతో హృతిక్, రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి, ‘కోయీ.. మిల్ గయా’లోని హృతిక్ పాత ఏలియన్ స్నేహితుడు ‘జాదూ’ క్యూట్‌గా రియాక్ట్ ఆక‌ట్టుకుంటుంది.

Biker Trailer : శ‌ర్వానంద్ బైక‌ర్ ట్రైల‌ర్‌.. అదిరిపోయింది..

ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్, సాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలకపాత్రల‌ను పోషించారు. హిందీ, తెలుగు, త‌మిళ‌, ఇంగ్లీష్ భాష‌ల్లో ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ చిత్రం మ‌న దేశంలో మార్చి 26న విడుద‌ల కానుంది.