Ranveer Singh: కాంతారలో హీరోకి దెయ్యం పట్టినట్టు.. ఒళ్ళు దగ్గరపెట్టుకోని మాట్లాడు.. దుమారంరేపుతున్న రణవీర్ కామెంట్స్
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నాడు. ఆ నేపధ్యంలోనే కాంతార సినిమా గురించి మాట్లాడుతూ అవహేళనగా మాట్లాడారు.
- V Santhosh Kumar
- Published On : November 30, 2025 / 04:33 PM IST
Bollywood hero Ranveer Singh controversial comments on Kantara movie
Ranveer Singh; సెలబ్రెటీలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే, జనాలు ఫోకస్ వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచం తేడాగా మాట్లాడిన ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ వస్తాయి. కాబట్టి, ఏది మాట్లాడినా ఒకటికి రెండుసార్లు అలోచించి మాట్లాడాలి. తాజాగా అలాంటి వివాదాస్పద కామెంట్స్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ రణవీర్ సింగ్. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే, గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న విషయం తెలిసిందే.
Maa Elections: మా ఎలక్షన్స్ జరిగేది అప్పుడే.. జనరల్ బాడీ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..
తాజాగా ఈ ఈవెంట్ లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్(Ranveer Singh) పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నాడు. ఆ నేపధ్యంలోనే కాంతార సినిమా గురించి మాట్లాడుతూ అవహేళనగా మాట్లాడారు. “కాంతార సినిమాలో హీరోకి దెయ్యం ఆవహించినప్పుడు ఓ అంటూ అరుస్తాడు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కన్నడ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ పై పెద్దఎత్తున మండిపడుతున్నారు. రణవీర్ సింగ్ ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి.
కాంతార సినిమాలో హీరోకి ఆవహించింది దెయ్యం కాదు. పెంజర్లి అనే దేవుడు. ఆమాత్రం తెలియకుండా ఎలా కామెంట్స్ చేస్తావ్. మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కర్ణాటక ప్రజలు పవిత్రం గా భావించే పెంజర్లి దేవుడిని అలా కామెడీ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది ఒక వివాదంగా మారింది. మరి ఈ వివాదంపై హీరో రణవీర్ సింగ్ ఎలా స్పందింస్తాడు అనేది చూడాలి.
