Ranveer Singh : బాబోయ్ ఇదేమి యాడ్ రా.. జానీ సిన్స్‌తో కలిసిన రణవీర్.. దేనికోసమో తెలుసా..!
అడల్ట్ స్టార్ జాన్ సిన్స్ తో కలిసి రణవీర్ సింగ్ ఓ టీవీ యాడ్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ గా మారింది.
- gum 95921
- Published On : February 13, 2024 / 03:36 PM IST
Bollywood Hero Ranveer Singh new ad gone viral in social media
Ranveer Singh : బాలీవుడ్ స్టార్ హీరోలు చేసే కొన్ని యాడ్స్.. అభిమానులను షాక్ కి గురి చేస్తుంటాయి. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి బడా స్టార్స్.. యూత్ ని తప్పు దారి పట్టించే పాన్ మసాలా వంటి బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తుంటారు. అంతేకాదు, ఆ యాడ్స్ తో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటుంటారు. ఇక తాజాగా మరో స్టార్ హీరో రణవీర్ సింగ్ చేసిన ఓ యాడ్ అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.
ఈ యాడ్ లో రణవీర్ తో పాటు అడల్ట్ స్టార్ అయిన జాన్ సిన్స్ కూడా కనిపించడం గమనార్హం. పోర్న్ ఇండస్ట్రీలో యాక్ట్ చేసే జానీ సిన్స్‌ని.. ఓ సెక్సువల్ ప్రోడక్ట్ యాడ్ కోసం ఇండియా తీసుకు వచ్చారు. ‘బోల్డ్ కేర్’ అనే ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తూ.. రణవీర్ అండ్ జానీ సిన్స్ యాడ్ చేశారు. ఇక ఈ యాడ్ ని బాలీవుడ్ సీరియల్స్ స్టైల్‌లో పేరడీగా తెరకెక్కించారు. ఈ యాడ్ ని రణవీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Ram Charan : మరో కొత్త హెయిర్ స్టైల్‌తో రామ్ చరణ్.. ఏమున్నాడ్రా బాబు.. లుక్ అదిరింది..
ఇక ఈ యాడ్ ని చూసిన ఆడియన్స్.. పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు. కేవలం ఒక చిన్న యాడ్ కోసం జానీ సిన్స్ ని ఇక్కడి వరకు తీసుకు వచ్చారా..? అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం.. బడా స్టార్ అయ్యుండి, రణవీర్ ఇలాంటి యాడ్ చేయడం ఏంటని..? కామెంట్స్ చేస్తున్నారు.
రణవీర్ సింగ్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం అజయ్ దేవగన్ నటిస్తున్న ‘సింగం ఎగైన్’ మూవీలో ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇక షారుఖ్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీస్ డాన్ 1, డాన్ 2కి కొనసాగింపుగా డాన్ 3ని ప్రకటించి.. అందులో తాను హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు తెలుస్తుంది.
