Kiara Advani: అప్పుడు నచ్చే చేశాను.. ఇప్పుడు స్క్రీన్ మీద చూడలేకపోతున్నా.. దయచేసి ఆ సీన్స్ కట్ చేయండి
టాక్సిక్ సినిమాలో కొన్ని ఇంటెన్స్ సీన్స్ ను తొలగించాలి అంటూ మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్న కియారా అద్వానీ(Kiara Advani).
- V Santhosh Kumar
- Updated on- May 3, 2026 / 08:36 AM IST
Bollywood heroine Kiara Advani requesting that the scenes be cut from yash Toxic movie
- ‘టాక్సిక్’ సీన్లపై కియారా అభ్యంతరం.
- ఇంటెన్స్ సీన్స్ తగ్గించాలని రిక్వెస్ట్.
- కథా ఇమేజ్ కోసం గీతూ పట్టుదల.
Kiara Advani: కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మూవీ ‘టాక్సిక్’. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం ఈ సినిమా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కియారా అద్వానీ, ఇటీవల సినిమా ఫైనల్ కట్ చూసి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. కథా డిమాండ్ మేరకు చిత్రీకరించిన కొన్ని బోల్డ్, ఇంటిమేట్ సీన్లు వెండితెరపై మరీ ఘాటుగా కనిపిస్తున్నాయని ఆమె ఫీలవుతున్నారట.
Sravanthi Chokkarapu: చీరకట్టులో మతిపోయే అందం.. యాంకర్ స్రవంతి బ్యూటిఫుల్ ఫొటోలు
ఈ సన్నివేశాలు తన ప్రస్తుత ఇమేజ్‌పై ప్రభావం చూపుతాయని భావించిన కియారా(Kiara Advani), వాటిని తొలగించాలని లేదా నిడివి తగ్గించాలని చిత్ర బృందాన్ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మాత్రం ఈ చిత్రాన్ని ఒక ‘పెద్దల కోసం రూపొందించిన అద్భుత కథ’గా అభివర్ణిస్తున్నారు. ఆ సీన్లు కథలో చాలా కీలకమని, వాటిని తీసివేస్తే సినిమాలోని భావోద్వేగ తీవ్రత తగ్గుతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
కెరీర్ ప్రారంభంలో బోల్డ్ పాత్రలు చేసినప్పటికీ, పెళ్లి తర్వాత కియారా తన ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలోని సన్నివేశాలు ఆమె నిర్ణయాన్ని సవాల్ చేసేలా ఉన్నాయని టాక్. మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో, ఆ సీన్లను కత్తెర వేస్తారో లేదో వేచి చూడాలి. సినిమా అవుట్‌పుట్ విషయంలో యష్ మరియు గీతూ చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
