Nagini Serial : 130 కోట్లతో సీరియల్.. హిట్ అవ్వకపోతే..
బాలీవుడ్ లో బాగా పౌలర్ అయిన సీరియల్స్ లో 'నాగిని' ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు టాప్ పొజిషన్ లో ప్రేక్షకులను అలరిస్తుంది. నాగిని సీరియల్స్ ని సీజన్ వైజ్........
- Saketh U
- Published on- February 2, 2022 / 01:57 PM IST
Nagini
Nagini Serial : బాలీవుడ్ లో బాగా పౌలర్ అయిన సీరియల్స్ లో ‘నాగిని’ ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటివరకు టాప్ పొజిషన్ లో ప్రేక్షకులను అలరిస్తుంది. నాగిని సీరియల్స్ ని సీజన్ వైజ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అయిదు సీజన్లు టెలికాస్ట్ అయ్యాయి. త్వరలో ఆరవ సీజన్ కూడా రాబోతుంది. ప్రాంతీయ భాషల్లో కూడా నాగిని సీరియల్ ని డబ్ చేశారు. తెలుగులో కూడా ‘నాగిని’ మొదటి రెండు సీజన్లను ప్రసారం చేశారు.
ఇప్పుడు తాజాగా ‘నాగిని’ సీరియల్ ఆరో సీజన్ రాబోతుంది. ఈ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం అవ్వనున్నట్లు తెలిపారు. ఈ సారి సీరియల్ లో ప్రధాన పాత్రలో హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్ తేజస్వీ ప్రకాష్ నటించనుంది. బిగ్ బాస్ గెలవడంతో ‘నాగిని’ సీరియల్ లో నటించే అవకాశం గెలుచుకుంది తేజస్వి.
ఈ సారి సీరియల్ ని మరింత భారీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సీజన్‌ను 130 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారని సమాచారం. నాగిని 6లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగా ఉండనున్నాయి. ఈ సారి ఇంత బడ్జెట్ పెట్టి నిర్మిస్తుండటంతో ఈ సీజన్ అంతగా హిట్ కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఈ ఫ్రాంచైజీని ఆపేయాలని నిర్మాత ఏక్తా కపూర్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Ashureddy : ఆర్జీవీ నుంచి నేర్చుకున్నాం అంటూ.. అరియనా నడుముపై అషూరెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్
ఇంత భారీ బడ్జెట్ తో పెద్ద సినిమానే తీయొచ్చని అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. అయితే ఇప్పటి వరకు ఉన్న ‘నాగిని’ సీరియల్ క్రేజ్ చూస్తే ఈ సీజన్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే అంటున్నారు. నాగిని సీరియల్ 6వ సీజన్ ఫిబ్రవరి 12 నుంచి కలర్స్ ఛానెల్లో ప్రతీ శనివారం, ఆదివారం ప్రసారం కానుంది.
