Chandrika Saha : పసిపిల్లాడిని నేలకేసి కొట్టిన నటి భర్త.. ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు!

బాలీవుడ్ లో సీరియల్ నటి భర్త తన 14 నెలలు కొడుకును ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు నేలకేసి కొట్టాడు. ఈ విషయం అంతా సీసీటీవీలో..

Bollywood serial actor Chandrika Saha husband attacked his 14 month baby

Chandrika Saha : ఈ మధ్యన దేశంలో మరి దారుణాలు జరుగుతున్నాయి. సొంత పిల్లలు పైనే తల్లిదండ్రులు పైశాచికం చూపిస్తున్నారు. తాజాగా ముంబైలో ఒక తండ్రి తన 14 నెలలు కొడుకును నేలకేసి కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. అసలు కథ ఏంటంటే.. బాలీవుడ్ లో సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ‘చంద్రిక సాహా’. సీఐడీ, సావధాన్‌ ఇండియా క్రైమ్‌ అలర్ట్‌ వంటి సూపర్ హిట్ సీరియల్స్ నటించి చంద్రిక మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ నటి వ్యక్తిగత విషయానికి వస్తే.. గతంలో ఒకతని పెళ్లి చేసుకొని విడాకులతో విడిపోయింది.

Vijay Devarakonda: గ్లోబల్ స్టార్‌కు రౌడీ స్టార్ థ్యాంక్స్.. ఎందుకంటే..?

ఆ తరువాత 2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్‌ మిశ్రతో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి సహజీవనం కూడా చేశారు. ఈ క్రమంలోనే చంద్రిక ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ గర్భాన్ని అబార్షన్‌ తో తొలిగించుకోవాలని అమన్‌ మిశ్ర కోరాడు. కానీ చంద్రిక అందుకు అంగీకరించలేదు. ఈ విషయం పై వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే వచ్చాయి. ఇంతలో ఒక మగబిడ్డకు చంద్రిక జన్మనించింది. అయితే బాబు పుట్టిన తరువాత కూడా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. ఆ గొడవలు మధ్యనే గత నెలలో చంద్రిక అండ్ అమన్ పెళ్లితో ఒక్కటయ్యారు.

Akhil Akkineni : ప్రభాస్ ప్రొడక్షన్‌లో సాహూ అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా.. నిజమేనా?

ఇక కొడుకు విషయంలో చంద్రికతో గొడవ పడుతూ వచ్చిన అమన్.. ఈసారి ఏకంగా పసిపిల్లాడి పైనే దాడి చేశాడు. ఈ శుక్రవారం చంద్రిక కిచెన్‌లో వంట పని చేస్తుండగా బాబు ఏడుపు వినిపించింది. బాబు ఏడుపు ఆపేలా తనని ఆడించమని భర్తకి చెప్పింది. దీంతో అమన్ ఆ పసి పిల్లాడిని బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళాడు. అయితే రూమ్ లోకి వెళ్ళాక ఒక పెద్ద సౌండ్, పిల్లవాడు కూడా గుక్కపెట్టి ఏడవడం చంద్రికకు వినిపించింది. రూమ్ లోకి వెళ్లిన చూసిన చంద్రికకు బాబు గాయపడి కనిపించడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించి తన బిడ్డని కాపాడుకుంది.

Pawan Kalyan : రేపు రాజమండ్రికి పవన్ కల్యాణ్ .. రైతన్నలకు పరామర్శ, పోలవరం ప్రాజెక్టు సందర్శన

పిల్లవాడి గాయాలు చూసిన చంద్రికకు అనుమానం వచ్చి ఇంటిలో సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే అసలు విషయం అక్కడ బయట పడింది. అమన్ తన చేతులుతో తను 14 నెలలు తన కొడుకును నేలకేసి ఒకటి కాదు రెండు కాదు మూడుసార్లు నేలకేసి కొట్టాడు. ఇక ఆ వీడియో చూసి షాక్ అయ్యిన చంద్రిక.. భర్త పై పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.