Thammudu Re Release: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. తమ్ముడు రీ-రిలీజ్.. ఎప్పుడంటే..
పవన్ తన అధికారిక పదవిని వ్యక్తిగత, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ, ఈ విషయంపై..(Thammudu Re Release)

Thammudu Re Release: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. థియేటర్స్ లో సందడి చేశాయి. రీ రిలీజ్ లోనూ కొన్ని సినిమాలు సత్తా చాటాయి.
ఇప్పుడు పవర్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ఇది పండగ లాంటి వార్త అని చెప్పాలి.
పవన్ కల్యాణ్ కల్ట్ క్లాసిక్ ‘తమ్ముడు’ సినిమా భారీ స్థాయిలో రీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తొలుత పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ అభిమానులు ఇప్పుడు అంతసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
ఈ సినిమా ఆగస్ట్ 30న తిరిగి విడుదల కానుంది. ఈ స్పోర్ట్స్ మూవీకి పీఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు.
బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ సినిమాలో ప్రీతి జంగ్యాని, అదితి గోవిత్రికర్, అచ్యుత్ నటించారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో స్పెషల్ గా నిలిచిన మూవీస్ లో స్టాలిన్ ఒకటి. స్టాలిన్ రీ రిలీజ్ కు సిద్ధమైంది.
చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్ట్ 22న ఈ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు.
4కే టెక్నాలజీతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.
ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ నిధులు, యంత్రాంగాన్ని పవన్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
పవన్ తన అధికారిక పదవిని వ్యక్తిగత, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ, ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
పవన్ నటించిన భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా ‘హరి హర వీర మల్లు’ సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఇప్పుడు OTTలో విడుదలవుతోంది.
క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ కూడా నటించారు. జూలై 24న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంది.
విడుదలైన ఒక నెల లోపే ఈ సినిమా ఆన్‌లైన్‌లో ప్రసారం కానుంది. ఈ చారిత్రక ఇతిహాసం ఆగస్ట్ 20 నుండి ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
Also Read: వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్.. ఆ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..