Akhil Akkineni : ప్రభాస్ ప్రొడక్షన్‌లో సాహూ అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా.. నిజమేనా?

ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ ని అందుకున్న అఖిల్.. తన తదుపరి సినిమాని ప్రభాస్ నిర్మాణ సంస్థలో చేయబోతున్నాడట. ఆ సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

Akhil Akkineni : ప్రభాస్ ప్రొడక్షన్‌లో సాహూ అసిస్టెంట్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా.. నిజమేనా?

Akhil Akkineni movie with Saaho assistant director under prabhas production house

Akhil Akkineni : అక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ (Agent) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇక ఈ చిత్రంతో ఎలాగైనా మాస్ ఇమేజ్ ని సొంత చేసుకోవాలని అఖిల్ చాలా ఆశ పడ్డాడు. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అంతా చాలా నిరాశ పడ్డారు. కాగా అఖిల్ ఈ సినిమా తరువాత ఏ మూవీ చేయబోతున్నాడు అనేది ఇప్పటి వరకు ప్రకటించ లేదు. అయితే అఖిల్ తదుపరి సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

Naga Chaitanya : ఆ విషయంలో మా నాన్న తప్పేమి లేదు.. నాగార్జున పై నాగచైతన్య కామెంట్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గ్రాండ్ గా లాంచ్ అయ్యి పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి దర్శకుడిగా ప్రభాస్ సాహూ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన అనీల్ కుమార్ ఈ సినిమాతో డెబ్యూట్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం అనిల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని చూసుకుంటున్నాడట.

Adipurush Trailer : ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది.. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఈ సినిమా టైటిల్ ని కూడా ఫైనల్ చేసేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీకి ‘ధీర’ అనే పవర్ టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వార్తలు పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా అఖిల్ అండ్ నాగార్జున సినిమాలు వరసగా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు అంతా నాగచైతన్య కస్టడీ (Custody) పైనే ఆశలు పెట్టుకున్నారు.