Anjali : ఓ వైపు అమ్మ మరణం.. ఇంకో వైపు రెండో డెలివరీ.. తల్లిని గుర్తుచేసుకుంటూ అంజలి ఎమోషనల్..
ఈ క్రమంలో తన తల్లి మరణం గురించి చెప్తూ అంజలి ఎమోషనల్ అయింది. (Anjali)
Anjali
Anjali : సీరియల్స్, టీవీ షోలతో ఫేమ్ తెచ్చుకుంది అంజలి. నటుడు పవన్ సంతోష్ తో పెళ్లి తర్వాత సీరియల్స్ కి కొంత గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ సీరియల్స్, టీవీ షోలు, యూట్యూబ్ తో బిజీగానే ఉంది. తాజాగా అంజలి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ లోని పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Anjali)
ఈ క్రమంలో తన తల్లి మరణం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.
Also See : Demon Pavan Rithu Chowdary : రీతూ చౌదరి – డిమాన్ పవన్.. ఇంత క్లోజ్ గా ఫొటోలు.. ఏంటి సంగతి..?
నటి అంజలి మాట్లాడుతూ.. మా అమ్మ తప్ప నాకు ఎవరూ లేరు. ఆవిడ ఆరోగ్యం చాలా పాడయ్యాక నా దగ్గరే పెట్టుకున్నా. సీమంతం కూడా వద్దనుకున్నా కానీ శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్ ప్లాన్ చేసి చేసారు. సీమంతం తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. బేబీ మెడకు పేగు చుట్టుకుంది అన్నారు. ఏడో నెలలోనే ఆపరేషన్ చేస్తామన్నారు కానీ చేయలేదు. అదే సమయంలో మా అమ్మకు హెల్త్ ఇష్యూస్. ఒక నర్స్ ని పెట్టి చూసుకునేవాళ్ళం. మా అమ్మ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేది. నాకు ప్రగ్నెన్సీ ఉండటంతో మెట్లు ఎక్కకూడదని ఆమె దగ్గరకు వెళ్లి చూడలేదు. కానీ ఒక రోజు ఎందుకో చూడాలనిపించి పైకి అమ్మ దగ్గరికి వెళ్ళా.
అమ్మ పరిస్థితి బాగోలేదు అనిపించి పవన్ కి చెప్తే అంబులెన్స్ తెప్పించారు. కానీ నన్ను అర్జున్ కళ్యాణ్ దగ్గర డ్రాప్ చేసి అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్తా అన్నారు. నన్ను డ్రాప్ చేసి వెళ్లిపోయారు. మా అమ్మ చనిపోయింది అప్పటికే. నాకు రాత్రి వరకు చెప్పలేదు ఈ విషయం. మా అమ్మ చనిపోయిన అయిదు రోజులకు నాకు డెలివరీ అయింది. ఓ వైపు అమ్మ పోయిన బాధ, ఇంకోవైపు బిడ్డ పుట్టాడు. ఆ సమయంలో అమ్మ ఉంటే బాగుండు అనిపించింది అంటూ ఎమోషనల్ అయింది.
Also Read : Raghu Kunche : రాయలసీమలో జరిగిన ఫ్యాక్షన్ కథలతో సినిమా.. ‘దేవగుడి’ దర్శక నిర్మాత, రఘు కుంచె ఇంటర్వ్యూ..
