Arijit Singh : ఫుల్ ఫామ్ లో ఉండగా 38 ఏళ్లకే.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ సింగర్.. బాధలో ఫ్యాన్స్..
స్టార్ సింగర్ సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. (Arijit Singh)
Arijit Singh
Arijit Singh : స్టార్ సింగర్ సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతి.. పలు భాషల్లో వందల పాటలు పాడి అందర్నీ మెప్పించాడు అర్జిత్ సింగ్. తన గాత్రంతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పటికే నేషనల్ అవార్డు, పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులను సాధించాడు.(Arijit Singh)
సింగర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు అర్జిత్ సింగ్. ఇలాంటి సమయంలో రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ షాక్ అవుతున్నారు. అర్జిత్ సింగ్ కి కేవలం 38 ఏళ్ళే. ఇంకా చాలా కెరీర్ ఉంది. అయినా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు అని ఫ్యాన్స్ బాధపడుతున్నాడు. ఆయన తోటి సింగర్స్, సంగీత కళాకారులు, సినీ సెలబ్రిటీలు సైతం అర్జిత్ సింగ్ నిర్ణయానికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Anjali : ఓ వైపు అమ్మ మరణం.. ఇంకో వైపు రెండో డెలివరీ.. తల్లిని గుర్తుచేసుకుంటూ అంజలి ఎమోషనల్..
తాజాగా అర్జిత్ సింగ్ తన సోషల్ మీడియాలో.. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇన్నాళ్లు మీ ప్రేమను ఇచ్చిన అందరికి ధన్యవాదాలు. ఇక నుంచి ప్లే బ్యాక్ సింగర్ గా నేను ఎలాంటి కొత్త వర్క్ ఒప్పుకోవట్లేదు అని హ్యాపీగా ప్రకటిస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. ఇదొక అద్భుతమైన జర్నీ అని పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. స్టార్ డమ్ వచ్చి మరింత ఎదుగుతున్న అర్జిత్ సింగ్ అప్పుడే రిటైర్మెంట్ ఏంటి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తూనే బాధపడుతున్నారు.
అర్జిత్ సింగ్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడగా తెలుగులో.. స్వామిరారా, కేడి, ఉయ్యాల జంపాల, మనం, రౌడీ ఫెలో, దోచేయ్, కేశవా, హుషారు, ఓం భీం బుష్.. ఇలా అనేక సినిమాల్లో పాటలు పాడి మెప్పించారు. సినిమాల సాంగ్స్ తో పాటు బయట ఈవెంట్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా అలరించాడు అర్జిత్. ఇంత ఫేమ్, పేరు తెచ్చుకున్న అర్జిత్ ఇంత తక్కువ వయసులోనే సింగర్ గా రిటైర్మెంట్ ప్రకటించడం ఏమిటో..
View this post on Instagram
Also Read : Demon Pavan Rithu Chowdary : రీతూ చౌదరి – డిమాన్ పవన్.. ఇంత క్లోజ్ గా ఫొటోలు.. ఏంటి సంగతి..?
