×
Ad

Sarfira : స్టార్ హీరో సినిమాకు ఎవరూ రాకపోవడంతో.. ఫ్రీగా ఛాయ్, సమోసా ఇస్తాం రండి అంటూ థియేటర్స్ ప్రకటన..

స్టార్ హీరోలు ఉన్నా సినిమాలని ఎవరూ పట్టించుకొవట్లేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ గత మూడేళ్ళుగా వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా అన్ని ఫ్లాప్ అవుతున్నాయి.

  • Published On : July 15, 2024 / 07:25 AM IST

Bollywood Star Hero Akshay Kumar Sarfira Movie not Getting Audience Theaters Offers Free Chai Samosa

Akshay Kumar Sarfira Movie : బాలీవుడ్ లో సినిమాల సక్సెస్ రేటు కరోనా తర్వాత తగ్గిందని అందరికి తెలిసిందే. స్టార్ హీరోలు ఉన్నా సినిమాలని ఎవరూ పట్టించుకొవట్లేదు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ గత మూడేళ్ళుగా వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. కొత్త కొత్త కథలతో ప్రయోగాలు చేసినా, కమర్షియల్ సినిమా చేసినా, సెంటిమెంట్ చేసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు.

అసలు అక్షయ్ కుమార్ సినిమాకు పెట్టే బడ్జెట్ కూడా కలెక్షన్స్ రూపంలో రావట్లేదు. తాజాగా అక్షయ్ కుమార్ ఆకాశమే నీ హద్దురా సినిమాని సర్ఫిరా పేరుతో రీమేక్ చేసాడు. ఆ సినిమా జులై 12న కేవలం హిందీలోనే రిలీజయింది. ఇక్కడ సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమా ఓటీటీలో రిలీజయి పెద్ద హిట్ అయింది. కానీ బాలీవుడ్ లో ఈ సర్ఫిరా సినిమాని ఎవరూ పట్టించుకోవట్లేదు.

Also Read : Star Actress : ఈ ఫొటోలో చిన్న పాపని గుర్తు పట్టారా?.. 60 ఏళ్ళు అంటూ బర్త్ డే విషెష్ చెప్తూ షేర్ చేసిన స్టార్ హీరోయిన్..

సర్ఫిరా సినిమాకు మొదటి రోజు దారుణంగా రెండున్నర కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు నాలుగున్నర కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా కేవలం 10 కోట్లు మాత్రమే నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. ఒక స్టార్ హీరో సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ అది కూడా వీకెండ్ అంటే ఫ్లాప్ సినిమానే. ఈ రేంజ్ కలెక్షన్స్ ఇక్కడ తెలుగులో మన మిడ్ రేంజ్ హీరోలకు కూడా వస్తాయి. స్టార్ హీరో సినిమాకి ఈ పరిస్థితి ఉండటంతో బాలీవుడ్ లో PVR మల్టీప్లెక్స్ థియేటర్స్ జనాల్ని రప్పించడానికి ఓ ఆఫర్ ని ప్రకటించాయి.

సర్ఫిరా సినిమా చూస్తే ఒక ఛాయ్, రెండు సమోసాలు ఫ్రీగా ఇస్తాము, అలాగే ఓ కూపన్ కూడా ఇస్తాము అని ప్రకటించింది. మళ్ళీ ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంతవరకే, తొందరగా టికెట్లు బుక్ చేసుకోండి అని పెట్టడం గమనార్హం. దీంతో స్టార్ హీరో సినిమాకి ఫ్రీగా ఫుడ్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.