Bosco Martis : హాస్పిటల్‌లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్.. వారణాసి, దేవర సినిమాలతో టాలీవుడ్ లో కూడా ఫేమ్..

ఇటీవలే బాస్కో మార్టిస్ మహేష్ బాబు వారణాసి సినిమాలో సాంగ్ కంపోజ్ చేసారని సమాచారం. (Bosco Martis)

  • Published on- June 30, 2026 / 10:42 PM IST

Bosco Martis

Bosco Martis : బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ హాస్పిటల్ లో చేరారు. గత కొన్ని రోజులుగా ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం, పెయిన్ రావడంతో బాస్కో మార్టిస్ ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఇటీవల జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు పరీక్షలు చేసి పరిశీలనలో ఉంచారని తెలుస్తుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాస్కో మార్టిస్ మాస్టర్ బాధపడుతున్నట్టు సమాచారం.

బాస్కో మార్టిస్ కు ఇప్పటికే అనేక రకాల పరీక్షలు, స్కాన్ లు నిర్వహించారు కానీ అధికారికంగా ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రకటించలేదు. దీంతో పలువురు నెటిజన్లు, బాలీవుడ్ స్టార్స్ బాస్కో మార్టిస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Also See : Actress Parvathie : మేము కాప్’లం సిరీస్‌ నటి.. సిరీస్‌లో పద్దతిగా.. సోషల్ మీడియాలో బోల్డ్‌గా..

ఇటీవలే బాస్కో మార్టిస్ మహేష్ బాబు వారణాసి సినిమాలో సాంగ్ కంపోజ్ చేసారని సమాచారం. ప్రియాంక చోప్రా ఓ హాలీవుడ్ ఇంటర్వ్యూలో సినిమాలో డ్యాన్స్ వేసే సాంగ్ ఒకటి ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ ని బాస్కో మార్టిస్ కంపోజ్ చేసారని సమాచారం. గతంలో ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా బాస్కో మార్టిస్ ఒక సాంగ్ కంపోజ్ చేసారు.

అంతకుముందు బాస్కో మార్టిస్ తెలుగులో వియ్యాలవారి కయ్యలు, ఆరెంజ్, శ్రీమంతుడు, ధ్రువ, దేవర సినిమాలకు పనిచేసాడు. మరికొన్ని తెలుగు సినిమాలకు తన తోటి డ్యాన్స్ మాస్టర్ సీజర్ గోన్స్లేవ్స్ తో కలిసి పనిచేసాడు. బాలీవుడ్ లో అయితే అనేక స్టార్ హీరోల సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసాడు బాస్కో మార్టిస్. దేవర సమయంలో ఎన్టీఆర్ గురించి ఇతను పెట్టిన పోస్ట్, ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ గురించి బాస్కో మార్టిస్ మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.