Boyapati Srinu: బోయపాటికి ఫుల్ డిమాండ్.. వైరల్ కుర్రోడు సెట్ చేసుకున్నాడట
దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) గాలి కిరీటితో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
- V Santhosh Kumar
- Published On : February 21, 2026 / 07:03 PM IST
Boyapati srinu next movie with gali kireeti
Boyapati Srinu: మాస్ అండ్ లార్జర్ దన్ లైఫ్ సినిమాలు చేయడంలో బోయపాటి శ్రీనును మించిన దర్శకుడు ఇంకొకడు లేదు. మాస్ ఆడియన్స్ కి ఎలాంటి అంశాలు కావాలో ఈ దర్శకుడికి బాగా తెలుసు. ఆయన సినిమాలు చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. రీసెంట్ గా ఈ దర్శకుడి నుంచి వచ్చిన సినిమా అఖండ 2. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో, ఫస్ట్ టైం బాలయ్య- బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబోలో మొదటిసారి ఒక సినిమా ప్లాప్ అయ్యింది.
Varanasi: శ్రీరాముడిగా మహేష్ బాబు.. వారణాసి నుంచి స్పెషల్ లుక్ వచ్చేసింది
దీంతో, బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, అంతటి ప్లాప్ తరువాత కూడా బోయపాటి శ్రీను డిమాండ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. వరుసగా నిర్మాతలు తమతో సినిమా చేయాల్సిదిగా అడ్వాన్సులు పట్టుకొని తిరుగుతున్నారట. కానీ, బోయపాటి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదట. ఈ మధ్యలో హిందీ మేకర్స్ కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారట. కానీ, దానికి కూడా ఒకే చెప్పడం లేదట బోయపాటి.
తాజా సమాచారం ప్రకారం కన్నడ నుంచి వచ్చిన ఒక యంగ్ హీరో కూడా బోయపాటితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. డా హీరో మరెవరో కాదు గాలి కిరీటి. ఈ హీరో చేసిన మొదటి సినిమా జూనియర్ మంచి విజయాన్ని సాధించింది. ఈమధ్యే ఈ హీరో తన రెండవ సినిమాలో భాగంగా బోయపాటిని కలిశాడట. తనతో సినిమా చేయాల్సిందిగా కోరాడట. దానికి, బోయపాటి నుంచి కూడా పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చిందని న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. మరి బోయపాటి, కిరీటి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
