Varanasi: శ్రీరాముడిగా మహేష్ బాబు.. వారణాసి నుంచి స్పెషల్ లుక్ వచ్చేసింది
వారణాసి(Varanasi) సినిమాలో శ్రీరాముడిగా మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Mahesh babu as lord sri rama in varanasi movie
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి(Varanasi). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అందుకే ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన స్పెషల్ వీడియోకి ఇంటర్నేషనల్ లెవల్లో ఎంతగా అప్లాజ్ వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Cult Teaser: విశ్వక్ సేన్ కల్ట్ టీజర్ వచ్చేసింది.. వైలెన్స్ మాత్రం అరాచకం
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నాడు అని రాజమౌళి స్వయంగా చెప్పాడు. రామాయణంలో ఒక ప్రత్యేకమైన ఘట్టాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట రాజమౌళి. ఇక అప్పటినుంచి మహేష్ బాబు శ్రీరాముడిగా ఎలా ఉంటాడు, ఆ సీన్స్ ని రాజమౌళి ఎలా తెరకెక్కిస్తున్నాడు అనేది తెలుసుకోవడానికి చాలా ఎగ్జాయింటింగ్ ఉన్నారు.
ఈనేపథ్యంలోనే తాజాగా మహేష్ బాబు శ్రీరాముడిగా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీరాముడిగా చేతిలో విల్లు పట్టుకొని ఉన్న మహేష్ బాబు లుక్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ ఒక్క స్టైల్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ లుక్ కి సంబందించిన ఒక స్టాండీని మైత్రి మూవీస్ కి సంబందించిన థియేటర్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడమే కాదు. వారణాసి సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

