Prabhas : బోయపాటి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నారా..!

బోయపాటి దర్శకత్వంలో ప్రభాస్ ఒక మాస్ మూవీ చేయబోతున్నారా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త.

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కల్కి, రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్.. చిత్రాలతో అదిరిపోయే లైనప్ లో ఉన్నారు. వీటిలో కల్కి, రాజాసాబ్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి. ఈ చిత్రాలు పూర్తి అయిన తరువాత సలార్ 2, స్పిరిట్ సినిమాలు మొదలు కానున్నాయి. అయితే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన మరో కొత్త సినిమా న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నారని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్ అండ్ బోయపాటి మధ్య సినిమా చర్చలు జరుగుతున్నాయని, అవి సఫలం అయితే.. ఇద్దరి కాంబోలో అదిరిపోయే మాస్ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని తెలుస్తుంది. ఈ కాంబో పై ప్రభాస్ అభిమానులు కూడా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.

Also read : Vishwak Sen : ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్.. విశ్వక్ సేన్ అంటూ అల్లు అర్జున్ కజిన్ స్టేట్‌మెంట్..

ప్రభాస్ ని బోయపాటి లాంటి ఊరమస్ దర్శకుడు డైరెక్షన్ లో చూస్తే.. ఆ కిక్కే వేరప్పా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ అన్ని ఓకే అయ్యి సెట్స్ పైకి వెళ్తుందా..? లేదా చర్చల్లోనే ఆగిపోతుందా..? అనేది వేచి చూడాలి. ప్రస్తుతం బోయపాటి గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ లో హీరో.. అల్లు అర్జున్, సూర్య, విజయ్ దేవరకొండ అంటూ పలు పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ లో ఏ హీరో ఎంట్రీ ఇస్తారో చూడాలి.

ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి విషయానికి వస్తే.. టీజర్‌ని మార్చిలో, ట్రైలర్‌ని ఏప్రిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్రెడ్ మూవీ డబ్బింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. మార్చి నుంచి ఫుల్ స్వింగ్ లో మూవీ ప్రమోషన్స్ ని చేయనున్నారట. మే 9న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు