Vishwak Sen : ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్.. విశ్వక్ సేన్ అంటూ అల్లు అర్జున్ కజిన్ స్టేట్‌మెంట్..

అల్లు అర్జున్ కజిన్ మాట్లాడుతూ.. ఈ జనరేషన్ 'జూనియర్ ఎన్టీఆర్' విశ్వక్ సేన్ అంటూ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ని పాస్ చేశారు.

Vishwak Sen : ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్.. విశ్వక్ సేన్ అంటూ అల్లు అర్జున్ కజిన్ స్టేట్‌మెంట్..

allu arjun cousin Viran Muttamsetty comparing Vishwak Sen with NTR

Updated On : February 21, 2024 / 1:11 PM IST

Vishwak Sen : జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన విశ్వక్ సేన్.. తన సినిమాలతో మాస్ లో మంచి ఇమేజ్ ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తూనే, నందమూరి ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానాన్ని కూడా అందుకుంటున్నారు. ఎన్టీఆర్ పై అభిమానాన్ని చూపిస్తూ, బాలయ్యతో ప్రేమగా మెలుగుతూ నందమూరి ఫ్యాన్స్ కి బాగా దగ్గరవుతున్నారు. ఇది ఇలా ఉంటే, అల్లు అర్జున్ కజిన్.. ‘విశ్వక్ సేన్ ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్’ అంటూ కామెంట్ చేయడం వైరల్ గా మారింది.

‘ముఖ్య గమనిక’ సినిమాలో హీరోగా నటిస్తూ ఆడియన్స్ కి పరిచయం అవుతున్న నటుడు ‘విరాన్‌ ముత్తంశెట్టి’. ఫిబ్రవరి 23న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో విరాన్ మాట్లాడుతూ.. “మా ముఖ్య అతిథి మాస్ కా దాస్, ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్ విశ్వక్ సేన్ గారు నేను కలిసే ప్రయాణిస్తూ వచ్చాము. ఆయన కష్టాలు నాకు తెలుసు, నా కష్టాలు ఆయనకి తెలుసు. ఆయన గురించి చాలామంది చాలా అనుకుంటారు. కానీ ఆయన గురించి ఒకటే చెబుతున్నా.. విశ్వక్ గారి కోపం ఉప్పెన. మనసు సముద్రం. ప్రేమ ఆకాశం. ఆ ప్రేమతోనే నాకోసం ఇక్కడి వరకు వచ్చారు. మాట ఇస్తే నిలబెట్టుకునే క్యారెక్టర్ ఆయనిది” అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ స్టేట్‌మెంట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also read : తరుణ్ భాస్కర్‌కి లీగల్ నోటీసులు పంపించడంపై.. ఎస్పీ చరణ్ లాయర్ కామెంట్స్..

 

View this post on Instagram

 

A post shared by CAPDT (@capdt)

ఇక విశ్వక్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. గామి సినిమా మార్చి 8న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో విశ్వక్ అఘోరగా నటిస్తున్నారు. మానవ స్పర్శ తెలియని ఫిజికల్ ప్రాబ్లెమ్ తో బాధ పడుతున్న హీరో.. దాని చికిత్స కోసం హిమాలయాలకు ప్రయాణం అయ్యి, దారిలో ఎదుర్కొన్న సంఘటనలతో ఆడియన్స్ ని థ్రిల్ చేయనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.