Brahmastra : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర.. ఎందుకు??
బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర ఎందుకంటే.. ఇటీవల ట్రైలర్ లో చూపించిన ఒక సన్నివేశమే కారణం. ఈ ట్రైలర్లో ఓ సన్నివేశంలో రణ్‌బీర్ కపూర్ గుడిలోకి వెళ్తూ గంటలు కొడతాడు. అయితే.....................
- Saketh U
- Published on- June 17, 2022 / 06:35 AM IST
Brahmastra
Brahmastra : బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఈ సినిమాని గట్టిగానే ప్రమోషన్ చేస్తున్నారు. ఒక పక్క రాజమౌళిని ప్రమోషన్స్ కి వాడేస్తూనే మరో పక్క చిరంజీవితో ఇటీవలే సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పించారు.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఎక్కువ VFX లతో ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ట్రోల్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. మాములు కథకి హాలీవుడ్ VFXలు జతచేశారని ఇప్పటికే ట్రైలర్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తెలుగులో అయితే అంజి, ఢమరుకం లాంటి సినిమాలు ఇలాంటివే వచ్చాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు.
Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?
బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర ఎందుకంటే.. ఇటీవల ట్రైలర్ లో చూపించిన ఒక సన్నివేశమే కారణం. ఈ ట్రైలర్లో ఓ సన్నివేశంలో రణ్‌బీర్ కపూర్ గుడిలోకి వెళ్తూ గంటలు కొడతాడు. అయితే ఆ సమయంలో రణ్‌బీర్ షూ ధరించి ఉన్నాడు. ఇప్పుడు ఇదే విమర్శలకు కారణంగా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘#BycottBrahmastra’ ట్యాగ్‌తో సినిమాని ట్రెండ్ చేస్తున్నారు. ‘బాలీవుడ్ షూలతో గుడిలోకి వెళ్లింది. ఈ మూవీని బాయ్‌కాట్ చేయండి’, ‘ఎందుకు అతను షూలతో టెంపుల్‌లోకి వెళ్లాడు’, గుడిలోకి షూలతో వెళ్తారా.. అంటూ ట్వీట్స్ చేస్తూ బ్రహ్మాస్త్రాన్ని బాయ్‌కాట్ చేయండి అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.
