Brahmastra: బ్రహ్మాస్త్ర ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ లో అసలు ప్రేక్షకులు థియేటర్లకే రాని సమయంలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో, భారీ విజువల్స్ తో, భారీ తారాగణంతో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "బ్రహ్మాస్త్ర". మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 'బ్రహ్మాస్త్ర శివ' ఈ శుక్రవారం ప్రమంచ వ్యాప్తంగా విడుదలయ్యి మిక్స్డ్ టాక్ తో ముందుకుపోతుంది.

  • Updated on- September 10, 2022 / 05:35 PM IST

Brahmastra Movie First Day Collections

Brahmastra: బాలీవుడ్ లో అసలు ప్రేక్షకులు థియేటర్లకే రాని సమయంలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో, భారీ విజువల్స్ తో, భారీ తారాగణంతో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “బ్రహ్మాస్త్ర”. మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర శివ’ ఈ శుక్రవారం ప్రమంచ వ్యాప్తంగా విడుదలయ్యి మిక్స్డ్ టాక్ తో ముందుకుపోతుంది.

Brahmastra Review : బ్రహ్మాస్త్ర రివ్యూ.. కేవలం విజువల్ ఫీస్ట్ మాత్రమేనా??

బీ-టౌన్ స్టార్ కపుల్ రన్‌బీర్-అలియా జంటగా నటిస్తూ, సహా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా..కరణ్ జోహార్ నిర్మిస్తూ ఈ సినిమా హిందీ వెర్షన్ ని సమర్పిస్తున్నాడు. సౌత్ లో ఈ చిత్ర సమర్పణ బాధ్యతలు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తీసుకోగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జునలు కీలక పాత్రలు పోషించారు. నాగిని ఫేమ్ మౌని రాయ్ విలన్ గా నటించింది.

ఇక విషయానికి వస్తే..ఈ మధ్య కాలంలో ఏ హిందీ సినిమాకి జరగనంత ప్రీ-బుకింగ్స్ ఈ సినిమాకి జరగడంతో చిత్ర యూనిట్ తో పాటు బాలీవుడ్ కూడా ఊపిరి పీల్చుకుంది. మొదటిరోజుకు గాను ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు సృష్టించినట్టు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటి వీకెండ్ ముగిసేపాటికి ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.