Brahmastra Review : బ్రహ్మాస్త్ర రివ్యూ.. కేవలం విజువల్ ఫీస్ట్ మాత్రమేనా??

బ్రహ్మాస్త్రం గొప్పదనాన్ని చెప్తూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. వానారాస్త్రం కలిగిన సైంటిస్ట్ పాత్రలో షారుఖ్‌ నటించగా అక్కడి నుంచి కథ ఓపెన్ చేశాడు. హీరో రణ్‌బీర్‌.............

Brahmastra Review : బ్రహ్మాస్త్ర రివ్యూ.. కేవలం విజువల్ ఫీస్ట్ మాత్రమేనా??

Brahmastra movie Review

Brahmastra Review : రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా బ్రహ్మాస్త్ర. నాగార్జున, అమితాబ్, షారుఖ్, మౌనిరాయ్ లాంటి స్టార్స్ అంతా ఇందులో నటించడం, ట్రైలర్ లో గ్రాఫిక్స్ ఓ రేంజ్ లో చూపించడం, రాజమౌళి దగ్గరుండి ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. సెప్టెంబర్ 9న బ్రహ్మస్త్ర సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది. హిందూ ధర్మాల్లో ఉన్న అస్త్రాలని ఆధారంగా రాసుకున్న కథ అని ముందు నుంచి అర్థమవుతూనే ఉంది.

శుక్రవారం రిలీజైన ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే సినిమా చూసిన ప్రేక్షకులు కేవలం ఇది విజువల్ ఫీస్ట్ మాత్రమే అని, కేవలం గ్రాఫిక్స్ కోసం సినిమాకి వెళ్లొచ్చు అని, కథ. కథనం మీద దర్శకుడు ఎక్కువగా దృష్టి పెట్టలేదని అంటున్నారు.

బ్రహ్మాస్త్రం గొప్పదనాన్ని చెప్తూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. వానారాస్త్రం కలిగిన సైంటిస్ట్ పాత్రలో షారుఖ్‌ నటించగా అక్కడి నుంచి కథ ఓపెన్ చేశాడు. హీరో రణ్‌బీర్‌ డీజే పాత్రలో నటించాడు. హీరోయిన్ ని చూడగానే ప్రేమలో పడటం, వీరిద్దరి మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలు, నాగార్జున ఎంట్రీ, నాగార్జున ఫైట్ ఇలాంటి అంశాలతో ఫస్ట్ హాఫ్ ముగియడంతో ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని భావించారు ప్రేక్షకులు. ఇక సెకండ్ హాఫ్ లో అమితాబ్ ఎంట్రీ ఇవ్వడం, విలన్ గా మౌనిరాయ్ పర్ఫార్మెన్స్, హీరో ఫైట్స్, గ్రాఫిక్ విజువల్స్, దుష్ట శక్తుల నుంచి బ్రహ్మాస్త్రాన్ని కాపాడటం అనే అంశాలు.. వీటన్నిటితో సెకండ్ హాఫ్ ని బాగా నడిపించాడు అనిపించింది.

OkeOka Jeevitham Movie Review : ఒకేఒక జీవితం సినిమా రివ్యూ.. శర్వానంద్ ఏడిపించేశాడుగా..

ఓవరాల్ గా మొదటి భాగం యావరేజ్ అనిపించినా, రెండో భాగం గ్రాఫిక్స్ తో బాగుంది అంటున్నారు ప్రేక్షకులు. గ్రాఫిక్స్ బాగుండటంతో కథ, కథనం తేలిపోయినా పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. దీంతో సినిమాని యావరేజ్ అంటున్నా, గ్రాఫిక్స్ కోసం సినిమాకి వెళ్లొచ్చు అంటున్నారు. నటీనటులంతా తమ పాత్రలకి తగ్గట్టు బాగా పర్ఫార్మ్ చేశారు. ఇంతమంది స్టార్ కాస్ట్ ఉండటంతో కమర్షియల్ అంశాలకి బాగా ప్లస్ అయి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రీత‌మ్ నేప‌థ్య సంగీతం అంతగా సినిమాకి ప్లస్ అవ్వలేదనిపిస్తుంది. ఇక గ్రాఫిక్స్, కెమెరా టీం మాత్రం బాగా కష్టపడ్డట్టు తెరపై కనిపిస్తుంది. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తే ఇన్నాళ్లు వరుస ఫ్లాప్స్ తో ఉన్న బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ వీకెండ్ బాలీవుడ్ లో మరే సినిమాలు లేకపోవడం కూడా బ్రహ్మాస్త్ర కలెక్షన్లకి ఏ మాత్రం డోఖా లేదు అని తెలుస్తుంది. మరి ఈ వీకెండ్ గడిస్తే కానీ పూర్తిగా దీని రిజల్ట్ ని అంచనా వేయలేరు సినీ వర్గాలు.