Peddi : తాపీమేస్త్రి ‘పెద్దిరాజు’ కథే పెద్ది సినిమానా..? బుచ్చిబాబు ఏం చెప్పాడంటే..
తాజాగా బుచ్చిబాబు పెద్ది కథ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. (Peddi)
- Saketh U
- Updated on- May 18, 2026 / 03:22 PM IST
Peddi
Peddi : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 4న ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. డైరెక్టర్ బుచ్చిబాబు కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
అయితే పెద్ది సినిమాలో హీరో క్రికెట్ ఆడటం, కుస్తీ ఆడటం, కుస్తీ పోటీలు ఉండటం, విజయనగరం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా అవ్వడంతో ఇది కుస్తీ వీరుడు కోడి రామ్మూర్తి బయోపిక్ అనుకున్నారు. తాజాగా బుచ్చిబాబు పెద్ది కథ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read : Rashmika Mandanna : రష్మికని బాలీవుడ్ హీరో ఇబ్బంది పెట్టాడా? వైరల్ అవుతున్న వీడియో..
బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లాలో నాకు తెలిసిన ఒక తాపీ మేస్త్రి ఉండేవారు. ఆయన పేరు పెద్దిరాజు. ఆయన తాపీ పని చేసుకుంటూనే క్రికెట్, బాస్కెట్ బాల్ బాగా ఆడేవారు. వాళ్ళది కొంచెం పేద కుటుంబం. దాంతో అతను ఎవరు డబ్బు ఇస్తే వాళ్ల తరఫున ఆడేవాడు. ఆయన నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ కథ రాసుకున్నాను.
ఉన్నది ఉన్నట్టు బయోపిక్‌గా కాకుండా కేవలం మెయిన్ పాయింట్ తీసుకొని చాలావరకు ఫిక్షన్ గానే రాసుకున్నాను. ఆయన పేరులోని పెద్దినే టైటిల్ గా అనుకున్నాను. ఆల్రెడీ రంగస్థలం గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ చేయడంతో ఈ పెద్ది విజయనగరం బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాను అని తెలిపాడు.
