Ram Charan: రామ్ చరణ్ సార్ మరో అవకాశం.. బుచ్చిబాబు క్రేజీ పోస్ట్ వైరల్

రామ్ చరణ్(Ram Charan) సార్ మరో ఛాన్స్ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడు బుచ్చిబాబు సన.

Buchibabu Sana posted that Ram Charan sir is another chance

  • రామ్ చరణ్ ‘ఎస్క్వైర్ ఇండియా’ వీడియో రిలీజ్
  • నెట్టింట వైరల్ గా మారిన రామ్ చరణ్ రాయల్ లుక్
  • ఆసక్తిని పెంచుతున్న బుచ్చిబాబు పోస్ట్

Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబోలో ‘పెద్ది’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. రా అండ్ రస్టిక్ కంటెంట్ తో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినీ వర్గాల్లో కూడా ఈ సినిమా సెన్సేషన్ సృష్టిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కాబోతుంది ఈ సినిమా. గేమ్ ఛేంజర్ లాంటి ప్లాప్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Nabha Natesh: స్టైలిష్ అండ్ హాట్.. కిల్లింగ్ లుక్స్‌తో మెరిసిపోతున్న నభా నటేష్.. ఫొటోలు

ఇదిలా ఉంటే, రామ్‌ చరణ్(Ram Charan) ఇటీవల ‘ఎస్క్వైర్ ఇండియా’ కోసం చేసిన స్టైలిష్ ఫోటోషూట్ నెట్టింట ఎంత వైరల్ అయ్యింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా దీనికి సంబందించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోకి కూడా ఇంటర్నేషనల్ లెవల్లో భారీ అప్లాజ్ వచ్చింది. అయితే, ఆ వీడియోకి బుచ్చిబాబు స్పందిస్తూ.. “సార్, మరో అవకాశం ఇవ్వండి” అని సరదాగా కామెంట్ చేశారు. పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు చేసిన ఈ చిన్న కామెంట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

అంతేకాదు, ‘పెద్ది’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో ప్రాజెక్ట్ ఉండబోతుందా? అనే చర్చ కూడా మొదలైంది. చరణ్‌ను గ్యాంగ్‌స్టర్‌గా చూడాలనుకుంటున్నామంటూ అభిమానులు ఈ పోస్ట్‌కు పెద్ద ఎత్తున రిప్లైలు ఇస్తున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలోని సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వస్తుండటంతో, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి నిజంగా రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో మరో సినిమా సెట్ అయ్యింఅంటే ఆంటే అది సెన్సేషనే అని చెప్పాలి.