Laxmmi Bomb: బుర్జ్‌ఖలీఫా సాంగ్ చూశారా!..
- sekhar
- Published On : October 18, 2020 / 08:52 PM IST
Laxmmi Bomb: బాలీవుడ్ స్టార్ హీరో Akshay Kumar నటించిన హారర్ కామెడీ చిత్రం ‘Laxmmi Bomb’.. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా మాతృకను రూపొందించిన దర్శకుడు Raghava Lawrence హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. Kiara Advani కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ‘లక్ష్మీ బాంబ్’ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
ఆదివారం ‘Burjkhalifa…’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫా నేపథ్యంలో చాలా బాగా చిత్రీకరించారు. Shashi – Dj Khushi కంపోజ్ చేసిన ఈ పాటను డీజే ఖుషి, నిఖితా గాంధీ పాడారు. Gagan Ahuja లిరిక్స్ రాశారు. పాటలో అక్షయ్, కియారాల కెమిస్ట్రీ హైలెట్ అని చెప్పాలి.
దీపావళి కానుకగా నవంబర్ 9న హాట్‌స్టార్‌లో ‘లక్ష్మీ బాంబ్’ స్ట్రీమింగ్ కానుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలలో వెండితెరపై విడుదలవుతోంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు.
