Butter Fly Teaser: పిల్లల కోసం అనుపమ వెతుకులాట.. థ్రిల్లర్‌గా బటర్ ఫ్లై!
ఇటీవల దిల్ రాజు సినీ వారసుడితో కలిసి రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోగా ఈసారి బటర్ ఫ్లైగా..
- Naresh Mannam
- Published On : March 3, 2022 / 02:45 PM IST
Butter Fly Teaser
Butter Fly Teaser: ఇటీవల దిల్ రాజు సినీ వారసుడితో కలిసి రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోగా ఈసారి బటర్ ఫ్లైగా వచ్చేందుకు సిద్ధమైంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ సినిమా నుండి వచ్చిన పోస్టర్ అటెన్షన్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన టీజర్ క్యూరియాసిటీని పెంచేస్తుంది.
Anupama Parameswaran: కిల్లర్ లుక్ తో చంపేస్తున్న అనుపమ!
టీజర్ చూస్తే.. ఒక అపార్ట్ మెంట్ లోకి అనుపమ ఎంటరవుతున్న సీన్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత లిఫ్ట్ లో.. తన ప్లాట్ లోకి ప్రవేశిస్తున్న సన్నివేశాలు కనిపించాయి. అయితే ప్లాట్ లోకి వెళ్లిన అనుసమ ఇద్దరు స్కూల్ పిల్లలతో తిరిగి బయటికి వస్తుంది. కానీ లిఫ్ట్ వద్దకు వచ్చే సరికి ఇద్దరు పిల్లలు కనిపించకుండా పోతారు. దీంతో వారి కోసం అనుసమా నిరంతరంగా వెతుకులాట ప్రారంభమవుతుంది. సీతాకోక చిలుకలా క్షణం తీరికలేకుండా పిల్లల ఆచూకీ కోసం వెతుకుతూనే ఉంటుంది. తమ ప్లాట్స్ లోని ఓ వ్యక్తితో కలిసి మరో కోణంలో వెతికినా ఫలితం ఉండదు. కానీ పిల్లల ఐడీ కార్డ్స్ మాత్రం లభిస్తాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో గుర్తుతెలియని వ్యక్తిని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చిక్కుకుంటుంది.
Anupama Parameswaran: కళ్ళలో మెరుపు.. కరెంట్ పాసయ్యే నవ్వు.. వీడియో వైరల్!
గుర్తు తెలియని వ్యక్తి వద్దకు అనుపమ చేరిన అనంతరం ఏం జరిగింది.. ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు?.. అసలు పిల్లల్ని ఎవరు ఎత్తుకెళ్లారు? పిల్లలకు అనుపమకు సంబంధం ఏంటీ? అసలు పిల్లలు మళ్లీ అనుపమ దగ్గరకు చేరుకుంటారా లేదా? అనే విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. 40 సెకండ్ల పాటు ఉన్న టీజర్ ఆసాంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. అర్విజ్, గిడియన్ కట్టా సంగీతం అందిస్తున్నారు.
