Anupama Parameswaran: కళ్ళలో మెరుపు.. కరెంట్ పాసయ్యే నవ్వు.. వీడియో వైరల్!

కళ్ళలో ఏదో మెరుపు.. బహుశా వాటినే మత్తెక్కించే కళ్లు అంటారేమో. ఆ నవ్వులో ఏదో మాయ ఉంటుంది.. అందుకే ఆ నవ్వు చూడగానే ఏదో కరెంట్ పాసైన ఫీలింగ్.

Anupama Parameswaran: కళ్ళలో మెరుపు.. కరెంట్ పాసయ్యే నవ్వు.. వీడియో వైరల్!

Anupama Parameswaran

Updated On : August 22, 2021 / 9:18 PM IST

Anupama Parameswaran: కళ్ళలో ఏదో మెరుపు.. బహుశా వాటినే మత్తెక్కించే కళ్లు అంటారేమో. ఆ నవ్వులో ఏదో మాయ ఉంటుంది.. అందుకే ఆ నవ్వు చూడగానే ఏదో కరెంట్ పాసైన ఫీలింగ్. ఆకట్టుకోవాలంటే ఒళ్ళు కనిపించాల్సిన పనిలేదు. ఉంగరాల కురులు.. ఓరచూపు చాలని నిరూపించింది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ ఆ’ సినిమాతో అనుపమ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆచితూచి తగిన సినిమాలనే ఎంచుకుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)


చిన్న వయసులో మంచి హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది. అందం, అభినయం, అనుకువ, అల్లరితో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ యంగ్ హీరోస్ తో జతకడుతూ తెలివిని చాటుకుంటుంది. ఓ వైపు సినిమాల‌తో అల‌రిస్తూనే.. మ‌రోవైపు సోషల్ మీడియాలో సంద‌డి చేస్తుంటుంది. తాజాగా ట్రెడిష‌న‌ల్ గ్లామ‌ర్ షో చేసిన వీడియో ఒకటి షేర్ చేసింది అనుప‌మ్.

 

View this post on Instagram

 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)


ఈ వీడియోలో అందరి హీరోయిన్స్ మాదిరి ఏదో తెచ్చిపెట్టిన ఫీల్ లేదు. ఉన్నదల్లా ప్ర‌కాశ‌వంత‌మైన క‌ళ్లు, క‌రెంట్ పాసయ్యేలా న‌వ్వు. దాంతోనే మిలియ‌న్ల హృద‌యాల్లో అల‌జ‌డి సృష్టిస్తోంది అనుప‌మ‌. ఓన‌మ్ శారీ కోసం చేసిన ఈ వీడియోలో అనుపమ ఫ్లోర‌ల్ బ్లౌజ్, నుదుట‌న సింధూరం, చేతికి రంగురంగుల గాజులతో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్న స్టిల్స్ ఇపుడు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.