Ranveer – Deepika : రణవీర్ దీపికా విడాకులు.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన హీరో..
రణవీర్ సింగ్ అండ్ దీపికా పదుకొణె మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని, విడాకులని ఇటీవల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీటన్నిటికీ ఒక్క ఫొటోతో రణవీర్ క్లారిటీ ఇచ్చేశాడు.
- gum 95921
- Published On : July 10, 2023 / 03:32 PM IST
calrity on divorce of Ranveer Singh and Deepika Padukone
Ranveer Singh – Deepika Padukone : బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ అండ్ దీపికా పదుకొణె 2018 లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తరువాత ఎవరికి వారు సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. ఇక ఈ జులై 6న రణవీర్ బర్త్ డే జరిగిన సంగతి తెలిసిందే. ఆరోజు దీపికా సోషల్ మీడియా వేదిక విషెస్ తెలియజేయలేదు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయని, విడాకులని రూమర్స్ రావడం మొదలయ్యాయి. అయితే వీటన్నిటికీ రణవీర్ ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేశాడు.
Guntur Karam : గుంటూరు కారం సినిమానే టార్గెట్ చేస్తున్నారు అందరూ.. ఎందుకో అర్ధం కావడం లేదు.. థమన్!
బర్త్ డే విషెస్ చెప్పిన అందరికి థాంక్యూ అంటూ దీపికాతో ఉన్న ఫోటో షేర్ చేశాడు. ఇక ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమయానికే వీరిద్దరి కలిసి ముంబైలో జంటగా ఒకే కారులో కనిపించారు. రణవీర్ పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు కలిసి మహారాష్ట్రలోని అలీబాగ్ కి (Alibaug) వెకేషన్ కి వెళ్లారు. అక్కడ నుండి ముంబైకి నిన్న జులై 9 రాత్రి తిరిగి వచ్చారు. దీంతో రణవీర్ అండ్ దీపికా కలిసే ఉన్నారని, విడాకులు వార్తలు రూమర్స్ అని తేలిపోయాయి.
calrity on divorce of Ranveer Singh and Deepika Padukone
ఇక వీరిద్దరి సినిమాలు విషయానికి వస్తే.. రణవీర్ ఈ జులై 28న ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని’ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దీపికా పదుకొణె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కి జోడిగా ఫైటర్ సినిమాలో నటిస్తుంది. అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో మెరబోతుంది.
