Mission Impossible : టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ వన్ జులై 12న గ్రాండ్ రిలీజ్..

మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ వన్ సినిమా జులై 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది మిషన్ ఇంపాజిబుల్ -ఫాల్అవుట్ (2018)కి సీక్వెల్, 7వ మిషన్ ఇంపాజిబుల్ ఫిల్మ్ సిరీస్.

Mission Impossible : టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ వన్ జులై 12న గ్రాండ్ రిలీజ్..

Mission Impossible Dead Reckoning releasing on July 12th world wide

Updated On : July 10, 2023 / 12:44 PM IST

Mission Impossible  :  టామ్ క్రూజ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాయి. హాలీవుడ్ లోనే కాకా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు టామ్ క్రూజ్. ఆయన నటించిన మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ వన్ సినిమా జులై 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇది మిషన్ ఇంపాజిబుల్ -ఫాల్అవుట్ (2018)కి సీక్వెల్, 7వ మిషన్ ఇంపాజిబుల్ ఫిల్మ్ సిరీస్. వయోకామ్ 18 స్టూడియోస్ ద్వారా జూలై 12న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగులో విడుదల కాబోతుంది.

ఈ మిషన్‌ ఇంపాజిబుల్ : డెడ్ రెకనింగ్ పార్ట్ వన్ లో ఏతాన్ హంట్ (టామ్ క్రూజ్) మరియు అతని IMF బృందం వారి అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభిస్తుంది. భయంకరమైన కొత్త ఆయుధం వేరే వారి చేతుల్లోకి రాకముందే వీరి బృందం దానిని దక్కించుకొని ఎలా ప్రపంచాన్ని కాపాడుతుంది. ఏతాన్ హంట్ ఎలా పోరాడాడు అనేది సినిమాలో చూడాల్సిందే. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఇండియాలో కూడా ఈ సినిమాల సిరీస్ కి, టామ్ క్రూజ్ కి అభిమానులు భారీగా ఉన్నారు.

Jawan : షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టీజర్ రిలీజ్.. నేను విలన్ అయితే నా ముందు నిలబడే హీరో ఎవడూ లేడు..

ఇక ఇందులో టామ్ క్రూజ్ పర్వతం నుండి మోటర్‌బైక్‌ మీద ద్రవీ చేస్తూ దూకడం, విమానంలోంచి దూకడం, ట్రాన్స్ యాక్సిడెంట్.. ఇలా ఇప్పటివరకు చేయని అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు టామ్ క్రూజ్. వెండితెరపై మరోసారి మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రికనింగ్ పార్ట్ 1, 2023లో భారీగా విడుదల అయి పెద్ద హిట్ సాధించి, అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.