Group 4 Exam : గ్రూప్ 4 ఎగ్జామ్ పేపర్లో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. కానీ.. ఇచ్చిన ఆప్షన్లలో ఒక నటుడికి బదులు మరో నటుడి పేరు

గ్రూప్ 4 ఎగ్జామ్‌లో 'బలగం' సినిమాపై ప్రశ్న వచ్చింది. అభ్యర్ధుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఈ ప్రశ్న కోసం జతచేయమని ఇచ్చిన ఆప్షన్లలో ఒక నటుడి పేరును తప్పుగా ముద్రించారు. మరి ఈ తప్పుపై అధికారులు ఏం చెబుతారు?

Group 4 Exam

Group 4 Exam : తెలంగాణ నేపథ్యంలో వచ్చి అందరి మనసులు దోచుకుని మన్ననలు అందుకున్న సినిమా ‘బలగం’ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం అందుకుంది.  ఈ సినిమాపై గ్రూప్ 4 పరీక్షలో ప్రశ్న రావడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Balagam : TS కానిస్టేబుల్ పరీక్షల్లో బలగం సినిమాపై ప్రశ్న.. ఏంటో తెలుసా?

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు రావడం సహజమే. అందులో కొత్తేం లేదు. అయితే అందరూ ఆస్కార్ సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ మీద ప్రశ్న రావచ్చని ఊహించుకున్నారు. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా కమెడియన్ వేణు యెల్దండి డైరెక్షన్‌లో వచ్చిన ‘బలగం’ సినిమాకు సంబంధించిన ప్రశ్న గ్రూప్ 4 ఎగ్జామ్‌లో ప్రత్యక్షమైంది. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తేసింది.

Balagam Movie: థియేటర్స్, ఓటీటీ తరువాత బుల్లితెరపై బలం చూపెట్టేందుకు రెడీ అయిన బలగం..!

బలగం సినిమాకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనేది ప్రశ్న. A. దర్శకుడు : వేణు యెల్దండి, B. నిర్మాత : దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి, C. సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో, D. కొమరయ్య పాత్రను పోషించినారు : అరుసం మధుసుధన్.. సరైన సమాధానం ఎంచుకొనుము అంటూ ABCD ఆప్షన్లను ఇచ్చారు. అయితే ఇక్కడే  చిన్న తప్పిదం దొర్లింది. డి ఆప్షన్‌లో కొమరయ్య పాత్రను పోషించినారు: అరుసం మధుసుధన్ అని ఇచ్చారు. నిజానికి ఆ పాత్రను పోషించింది సుధాకర్ రెడ్డి గారు. బలగం సినిమాను కమెడియన్ వేణు యెల్దండి డైరెక్ట్ చేశారు. హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డిలతో దిల్ రాజు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

 

ట్రెండింగ్ వార్తలు