Carmeni Selvam : మధ్యతరగతి వాళ్ళు చూడాల్సిన సినిమా.. అప్పుల్లో ఉన్నవాళ్లకు ధైర్యం ఇస్తుంది..
తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రామ్ చక్రి మీడియాతో మాట్లాడారు. (Carmeni Selvam)
- Saketh U
- Published On : April 1, 2026 / 10:02 PM IST
Carmeni Selvam
Carmeni Selvam : పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కార్మేని సెల్వం’. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 3న తమిళ్, తెలుగులో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రామ్ చక్రి మీడియాతో మాట్లాడారు.
రామ్ చక్రి మాట్లాడుతూ.. నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ఆర్య. ఆ తర్వాత ఆనంద్, గోదావరి సినిమాలు చూసా. వాటితో తెలుగు సినిమా ఇండస్ట్రీ భిన్నమైన కథల శైలులను ఎంతో అద్భుతంగా స్వీకరిస్తుంది అని తెలిసింది. ఆ బ్యాలెన్స్ నాకు చాలా ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది. నాకు శేఖర్ కమ్ముల గారితో పని చేసే అవకాశం రాకపోయినా ఆయనను నా గురువుగా భావిస్తాను. ఆయన సినిమాలు చూస్తూ నేర్చుకున్నాను అన్నారు.
Also Read : Adivi Sesh : అమ్మాయి కోసం దేశం దాటిన హీరో.. అడివి శేష్ ప్రేమకథ తెలుసా..?
‘కార్మేని సెల్వం’ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా మధ్య తరగతి జీవితంపై తీసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు కామన్‌గా ఉంటాయి. వాటి కారణంగా కుటుంబంలోని సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించాము. సముద్రఖని గారు మధ్యతరగతి భర్తగా, తండ్రిగా ఎమోషన్‌ను పండించారు. ఆయనతో పాటు గౌతమ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ పాత్రలు ఆకట్టుకుంటాయి. మా టెక్నికల్ టీమ్ కూడా ఎంతో సపోర్ట్ చేసింది. మా నిర్మాత అరుణ్ రంగరాజులు కథపై నమ్మకం ఉంచి మంచి క్వాలిటీతో సినిమా చేయడానికి మాకు సహకరించారు అని అన్నారు.
అలాగే.. ఈ సినిమా ద్వారా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. కుటుంబంలోని పెద్దలు కొందరు విదేశాల్లో జీవనోపాధి కొనసాగిస్తున్నారు. కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఏడాదికి కనీసం ఒకట్రెండు సార్లు అయినా వారు వచ్చి తమ కుటుంబాలతో కలవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా అన్నారు.
Also Read : SP Bala Subrahmanyam : కేరళలో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ఫొటోలు..
