Tollywood : టాలీవుడ్‌లో మళ్లీ క్యాస్టింగ్ కౌచ్ దుమారం

క్యాస్టింగ్ కౌచ్ అంశం టాలీవుడ్‌లో (Tollywood) మరోసారి చర్చకు దారి తీసింది.

Casting couch controversy erupts again in Tollywood

Tollywood : క్యాస్టింగ్ కౌచ్ అంశం టాలీవుడ్‌లో మరోసారి చర్చకు దారి తీసింది. గతంలో ఎన్నో సార్లు ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా నడిచింది. పలువురు యాక్ట్రస్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌తో..ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో క్యాస్టింగ్‌ కౌచ్‌..కమిట్‌మెంట్ అలిగేషన్స్‌ దుమారం లేపుతూ ఉన్నాయి. ప్రతీసారి పెద్ద వివాదంగా చర్చ జరిగి..ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు.

లేటెస్ట్‌గా హీరోయిన్ చాందిని చౌదరి చేసిన వ్యాఖ్యలతో క్యాస్టింగ్‌ కౌచ్ మరో వార్తల్లోకి ఎక్కింది. సినిమా ప్రయత్నాల్లో తన అనుభవాలు, అవకాశాల కోసం ప్రయత్నించే కొత్త నటీమణులు ఎదుర్కొనే ఒత్తిళ్లపై స్పష్టంగా వివరించారామె. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే కొన్నిసార్లు ఇతర అంశాలు ప్రాధాన్యం పొందుతున్నాయనే అర్థం వచ్చేలా ఆమె మాటలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Anupama Parameswaran : అదిరిపోయిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫోటోలు.. మీ దేశీ గ‌ర్ల్ అంటూ..

ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడం కూడా క్యాస్టింగ్ కౌచ్‌ ఎపిసోడ్‌ మరో తెరపైకి వచ్చింది. ఆమె చెప్పిన వివరాలు, ఇండస్ట్రీలోకి రావాలనుకునే యువతులు ఎదుర్కొనే పరిస్థితులపై మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అటు చాందిని చౌదరి, ఇటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుభవాలు..రెండూ కలిసి ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. గతంలో ఇలాంటి సమస్యలను అరికట్టేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీలు ఇప్పుడు ఏం చేస్తున్నాయన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఆ కమిటీలు ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతున్నాయి.? బాధితులకు నిజంగా న్యాయం జరుగుతోందా.? లేక వ్యవస్థలో లోపాల వల్లే సమస్యగా మారుతున్నాయా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు స్పందించి, కఠిన చర్యలు తీసుకునేలా రూట్‌మ్యాప్ రెడీ చేస్తారా.? లేక ఎప్పటిలాగే క్యాస్టింగ్ కౌచ్‌ అనేది చర్చకే పరిమితం అవుతుందా.? అన్నది వేచి చూడాలి.