Catherine Tresa: వరుణ్ సందేశ్ ‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కేథరిన్.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అనంతరం పూరి జగన్నాధ్ కంట్లో పడి స్టార్ హీరో అల్లు అర్జున్ తో కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో నటించింది.
ఈ సినిమాలో అందమే తన ఆయుధంగా కుర్రకారును తనవైపు తిప్పుకుంది.
ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘పైసా’, మళ్ళీ అల్లు అర్జున్తో ‘సరైనోడు’ సినిమాలు చేసినా.. రానురాను ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
గత ఏడాది విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన కేథరిన్ ఆ తర్వాత తెలుగుకు దూరమైంది.
ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్న కేథరిన్.. తెలుగు ఇండస్ట్రీ మీద మళ్ళీ ఫోకస్ పెంచింది.
ఇందులో భాగంగానే వరస ఫోటో షూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
అసలే బిగి అందాలు కావడంతో ఆ కెమెరా కూడా మరింత అందంగా ఆ అందాలను క్లిక్ చేస్తుంది.
కాగా, కేథరిన్ ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ బింబిసారతో పాటు భళా తందానా సినిమాలలో నటిస్తుంది.
మరి ఈ రెండు సినిమాలతో అయినా కేథరిన్ ఫేట్ మారుతుందేమో చూడాలి.