Aryan Khan : ముంబైలో ఆర్యన్ కి బెయిల్.. కర్నూల్ లో సంబరాలు.. విమర్శిస్తున్న నెటిజన్లు
ముంబైలో ఆర్యన్ బెయిల్ పై బయటకి వస్తుండటంతో నిన్న రాత్రి కర్నూల్ లో కూడా షారుఖ్ అభిమానులు ఆర్యన్ కి సపోర్ట్ గా బ్యానర్స్ పట్టుకొని బాణాసంచా కాల్చారు. కర్నూలు కొండారెడ్డి బురుజు
- Saketh U
- Published On : October 30, 2021 / 10:07 AM IST
Aryan
Aryan Khan : ఇటీవల డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. వాదనలు, వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆర్యన్ కి బెయిల్ మంజూరు అయింది. ఇవాళ ఆర్యన్ జైలు నుంచి బయటకి రానున్నాడు. అయితే ఆర్యన్ కి బెయిల్ రావడానికి షారుఖ్ ఎంతగానో ట్రై చేశాడు. తన పరపతి మొత్తం ఉపయోగించాడు. బెయిల్ మంజూరవడంతో షారుఖ్ అభిమానులు నిన్న రాత్రి కోర్టు వద్దే బాణాసంచా కాల్చారు. షారుఖ్ ఇంటి వద్ద కూడా అభిమానులు బాణాసంచా కాల్చారు. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. షారుఖ్ కూడా లీగల్ టీం కి పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
Niharika : నిర్మాతగా మెగా డాటర్.. ఓటిటిలో సినిమా
అయితే అక్కడ ముంబైలో ఆర్యన్ బెయిల్ పై బయటకి వస్తుండటంతో నిన్న రాత్రి కర్నూల్ లో కూడా షారుఖ్ అభిమానులు ఆర్యన్ కి సపోర్ట్ గా బ్యానర్స్ పట్టుకొని బాణాసంచా కాల్చారు. కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ వద్ద బాణాసంచా కాల్చారు. అయితే ఈ విషయంపై కొంతమంది నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్లి బెయిల్ పై బయటకి వచ్చిన వాళ్ళ కోసం ఇలా సంబరాలు జరపడమేంటి అంటూ విమర్శలు చేస్తున్నారు.
After the bail order;kurnool SRK FANS doing celebrations near Konda Reddy circle.@iamsrk,@adilshah#AryanKhan @gurusrk1 @yrf pic.twitter.com/nDR0J8J9Ag
— Haneef..SRK..ALLU (@allu_srk) October 28, 2021
