Celebrity Kids : క్యూట్ కిడ్స్.. మీమ్ మామూలుగా లేదుగా..!

రక్షా బంధన్ సందర్భంగా సెలబ్రిటీ కిడ్స్‌కి సంబంధించిన ఓ క్యూట్ మీమ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..

Celebrity Kids

Celebrity Kids: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పడుతూ.. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన తోబుట్టులు ఆప్యాయంగా ప్రేమానురాగాలను పంచుకునే అపురూపమైన బంధం.. రక్షా బంధన్.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఈ ఏడాది రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు.

Raksha Bandhan 2021 : సెలబ్రిటీస్ రక్షా బంధన్..

మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తమ సోదరీమణులతో రాఖీలు కట్టించుకుని తల్లి అంజనా దేవి ఆశీర్వాదం తీసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శ్రీజ, సుష్మిత కొణిదెల రాఖీ సెలబ్రేషన్స్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహా రెడ్డిల క్యూట్ కిడ్స్ అర్హ, అయాన్, సూపర్ స్టార్ మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ పిల్లలు సితార, గౌతమ్ రాఖీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ క్యూట్ మీమ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

గౌతమ్ తమ ఇంట్లో చెల్లి సితార డామినేషన్ అని చెప్తే.. అయాన్, ‘మా ఇంట్లో కూడా సిస్టర్ డామినేషనే బ్రో’ అంటాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల లవ్లీ కిడ్స్ అభయ్ రామ్, భార్గవ రామ్ ఇద్దరూ.. సిస్టర్ లేకపోవడంతో ‘మేం సేఫ్ బ్రో’ అని చెప్తారు. ఈ క్యూట్ మీమ్ ఆయా హీరోల అభిమానులను, నెటిజన్లను భలే ఆకట్టుకుంటోంది.

Pic Credit :@chiranjeevikonidela
@namratashirodkar
@allusnehareddy