Peddi Censor: వామ్మో.. ‘పెద్ది’లో ఇన్ని బూతులా.. ‘సరుకు సామాను’తో సహా.. ఎన్ని కట్స్ పడ్డాయో తెలుసా?
పెద్ది సినిమాకు షాకింగ్ కట్స్ ఇచ్చిన సెన్సార్ (Peddi Censor)బోర్డు.
- V Santhosh Kumar
- Updated on- May 23, 2026 / 06:40 PM IST
Censor Board issued U_A certificate for Ram Charan peddi film
- ‘పెద్ది’ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్.
- కొన్ని అభ్యంతరకర డైలాగులు మ్యూట్.
- 3 గంటల రన్‌టైమ్‌తో వస్తోంది.
Peddi Censor: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది(Peddi Censor)’. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని యూ/ఏ (U/A) సర్టిఫికేట్ వైపే మొగ్గు చూపడంతో, సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని కీలకమైన మార్పులు, షరతులతో ఈ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.
ఈ సినిమా పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగడం వల్ల కథా పరంగా అక్కడక్కడా కొన్ని అభ్యంతరకరమైన బూతు పదాలు, డబుల్ మీనింగ్ డైలాగులు చోటు చేసుకున్నాయి. సెన్సార్ బోర్డు వాటిని గుర్తించి బొక్క, మాదర్ చోద్ వంటి పదాలను పూర్తిగా మ్యూట్ చేయించింది. అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ‘చికిరి చికిరి’ పాటలోని కొన్ని ద్వంద్వార్థ పదాలను మార్చాలని, మిడిల్ ఫింగర్ చూపించే ఒక సీన్‌ను బ్లర్ చేయాలని ఆదేశించింది. ఈ మార్పులన్నింటికీ చిత్ర యూనిట్ అంగీకరించింది.
వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ చిత్రం మొత్తం 3 గంటల 9 నిమిషాల సుదీర్ఘ రన్‌టైమ్‌తో థియేటర్లలోకి రాబోతోంది. ఇదిలా ఉంటే, సినిమా పాన్ ఇండియా ప్రమోషన్స్‌ను మేకర్స్ మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా శనివారం రోజున భోపాల్‌లో ఒక భారీ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకలోనే అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలోని స్పెషల్ ఐటెం సాంగ్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు.
