Chalapathi Rao Funeral : మూడు రోజుల తర్వాతే చలపతి రావు అంత్యక్రియలు.. అప్పటిదాకా..
చలపతి రావు కుమారుడు నటుడు, డైరెక్టర్ రవిబాబు ఇక్కడే ఉన్నా ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అయితే వాళ్ళు వచ్చాకే అంత్యక్రియలు నిర్వహిస్తామని.............
- Saketh U
- Updated on- December 28, 2022 / 07:42 AM IST
Chalapathi Rao Funeral will happens after 3 days
Chalapathi Rao Funeral : 2022లో టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం టాలీవుడ్ ఎంతోమంది అగ్రతారలని కోల్పోయింది. రెండు రోజుల క్రితమే కైకాల సత్యనారాయణ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూశారు. 78 ఏళ్ళ వయసులో శనివారం నాడు రాత్రి గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించారు.
600 కి పైగా సినిమాల్లో విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులని మెప్పించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు మూడు రోజుల తర్వాత నిర్వహించనున్నారు.
Chalapathi Rao : టాలీవుడ్ బాబాయ్.. చలపతి రావు..
చలపతి రావు కుమారుడు నటుడు, డైరెక్టర్ రవిబాబు ఇక్కడే ఉన్నా ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అయితే వాళ్ళు వచ్చాకే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు కుమార్తెలు రావడానికి ఆలస్యం అవ్వనుంది. దీంతో కుమార్తెలు వచ్చాకే చలపతి రావు అంత్యక్రియలు మహాప్రస్థానంలో బుధవారం నాడు జరపనున్నారు. అప్పటివరకు మహాప్రస్థానంలోనే ఫ్రీజర్ లో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు కుటుంబ సభ్యులు.
